సీబీఈసీ ఇకపై సీబీఐటీ

12 Sep, 2016 00:18 IST|Sakshi
సీబీఈసీ ఇకపై సీబీఐటీ

న్యూఢిల్లీ: పరోక్ష పన్నుల అత్యున్నత విభాగం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ (సీబీఈసీ) త్వరలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డెరైక్ట్ ట్యాక్స్ (సీబీఐటీ)గా పేరు మార్చుకోనుంది. జీఎస్టీ అమలు గడువు అయిన వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. జీఎస్టీ వ్యవస్థాగత నిర్మాణానికి సంబంధించిన ముసాయిదాలో ఈ విషయాన్ని పేర్కొన్నట్టు రెవెన్యూ శాఖ వర్గాలు తెలిపాయి. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించే నిబంధనలు, మినహాయింపులను సీబీఐటీ అమలు చేస్తుంది. సీబీఐటీలో ఆరుగురు సభ్యులు ఉంటారు. వీరు కస్టమ్స్, ఐటీ, సెంట్రల్ ఎక్సైజ్, న్యాయ పరమైన అంశాలు, శిక్షణ, వివాదాల వంటివి పర్యవేక్షిస్తారు.

మరిన్ని వార్తలు