20 ఏళ్ల తర్వాత ‘క్యాడ్‌’ గుప్పిట్లోకి చైనా!

8 Aug, 2018 00:53 IST|Sakshi

బీజింగ్‌: ఇరవై సంవత్సరాల్లో మొట్టమొదటిసారి ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన చైనా కరెంట్‌ అకౌంట్‌ లోటు (క్యాడ్‌– సీఏడీ) సమస్యలోకి జారింది. 2018 మొదటి ఆరు నెలల కాలంలో (జనవరి–జూన్‌) 28.3 బిలియన్‌ డాలర్ల క్యాడ్‌ను నమోదు చేసింది.

అమెరికాతో వాణిజ్య యుద్ధం,  చైనా నుంచి దిగుమతులపై అమెరికా భారీ సుంకాలు ఈ పరిణామానికి నేపథ్యం. ఆరు నెలల కాలాన్ని చూస్తే 20 సంవత్సరాల తర్వాత క్యాడ్‌ నమోదయితే, త్రైమాసికం పరంగా పదిహేడేళ్లలో ఈ సమస్యను ఎదుర్కొనడం ఇదే తొలిసారి. దీనితో ఏళ్ల తరబడి భారీ ఎగుమతులతో వాణిజ్య మిగులు దేశంగా ఉన్న చైనా, ఆ ప్రతిష్టను కోల్పోయినట్లయ్యింది.  

2008 నుంచే దిగువమెట్టు...
నిజానికి 2008 ఆర్థిక సంక్షోభం నుంచీ చైనా వాణిజ్య మిగులు పరిస్థితి దిగజారుతూ వస్తోంది. 2007 చైనా స్థూల దేశీయోత్పత్తిలో ఆ దేశ వాణిజ్య మిగులు 9.9 శాతం అయితే 2017లో ఇది 1.3 శాతానికి పడిపోయింది.

మరిన్ని వార్తలు