తుపాన్ క్లెయిమ్స్ కోసం..

26 Oct, 2014 02:44 IST|Sakshi
తుపాన్ క్లెయిమ్స్ కోసం..

హుదూద్ తుపాన్ వల్ల జరిగిన ప్రాణ, ఆస్తి నష్టాలకు సంబంధించిన క్లెయిమ్‌లను త్వరితగతిన పరిష్కరించడానికి బీమా కంపెనీలు ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నాయి.
 
బజాజ్ అలయంజ్ జనరల్ ఇన్సూరెన్స్
హుదూద్ తుపాన్ బాధితుల కోసం 1800 209 7072 అనే ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్‌ను బజాజ్ అలయంజ్ ఏర్పాటు చేసింది. ఈ టోల్‌ఫ్రీ నంబర్‌కి ఫోన్ చేయడం ద్వారా క్లెయిమ్‌కు దరఖాస్తు చేసుకోవడంతో పాటు, క్లెయిమ్ స్టేటస్‌ను తెలుసుకోవచ్చు.
 
ఐసీఐసీఐ లాంబార్డ్
జరిగిన నష్టం వివరాలకు సంబంధించి తక్కువ కాగితాలను సమర్పించడం ద్వారా క్లెయిమ్‌ను వేగవంతంగా పరిష్కరించే విధంగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఆస్తి నష్టానికి సంబంధించి వివరాలు, సర్వేయర్ అంచనా, కేవైసీ నిబంధనలు ఇస్తే సరిపోతుంది. అలాగే వాహనానికి సంబంధించి ఆర్‌సీతో పాటు మరమ్మత్తులకు సంబంధించి మెకానిక్ ఇన్వాయిస్ బిల్ ఇస్తే సరిపోతుంది.
 
హెచ్‌డీఎఫ్‌సీలైఫ్
జీవిత బీమా క్లెయిమ్‌లకు సంబంధించి హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రాజమండ్రి పరిసర ప్రాంతాల వాళ్లు 9885097340 అనే నెంబర్‌లో మహేశ్‌ని, విశాఖపట్నంలో 9848283713 అనే నంబర్లో రామ్.కే, ఒరిస్సా బరంపురంలో శ్రీధర్ పాండాని 9853257626 అనే నంబర్‌లలో సంప్రదించవచ్చు. ఇది కాకుండా 18602679999 అనే టోల్‌ఫ్రీ నంబర్ ద్వారా సేవలు పొందవచ్చు.
 
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్
కేవలం మూడు డాక్యుమెంట్లతో జీవిత బీమా క్లెయిమ్ దరఖాస్తు చేసుకోవచ్చు. క్లెయిమ్ కోరుతూ రాత పూర్వక సమాచారంతో పాటు నామినీ ఫోటో గుర్తింపు కార్డు, పాలసీదారుని మరణ ధ్రువీకరణ పత్రం ఇస్తే సరిపోతుంది. 24 గంటలు సేవలు అందించడానికి 18602667766 టోల్ ఫ్రీ నంబర్‌ను అందుబాటులో ఉంచింది.

మరిన్ని వార్తలు