మా విధానాలతోనే మార్కెట్ పరుగు

27 Apr, 2014 00:32 IST|Sakshi
మా విధానాలతోనే మార్కెట్ పరుగు

న్యూఢిల్లీ: ప్రభుత్వ విధానాలతో భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టతపై ఇన్వెస్టర్లకు నమ్మకం పెరుగుతుండటమే స్టాక్ మార్కెట్ల పరుగుకు కారణమని కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం చెప్పారు. ఈ ఘనతను బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి కట్టబెట్టడం సరికాదన్నారు. యూపీఏ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో దేశ ఎకానమీ రానున్న రోజుల్లో మరింత పటిష్టంగా మారుతుందని శనివారం మీడియా సమావేశంలో చిదంబరం పేర్కొన్నారు.

ఇప్పటికే ద్రవ్య లోటును గణనీయంగా కట్టడి చేయగలిగామని, పరోక్ష పన్నుల వసూళ్లలో రూ. 17,000 కోట్లు తగ్గినప్పటికీ.. మొత్తం మీద పన్ను వసూళ్లు అంచనాలకు దరిదాపుల్లోనే ఉన్నాయని తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో కరెంటు అకౌంటు లోటు 88 బిలియన్ డాలర్ల నుంచి 32 బిలియన్ డాలర్లకు తగ్గిందని చెప్పారు. మరోవైపు, స్విస్ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనానికి సంబంధించిన అకౌంట్ల వివరాలను ఇచ్చిపుచ్చుకునే విషయంపై భారత్, స్విట్జర్లాండ్ చర్చలు జరుపుతున్నాయని ఆయన వివరించారు.

మరిన్ని వార్తలు