భారీ కుంభకోణం: బ్యాంక్‌ మాజీ అధికారి అరెస్ట్‌

13 Jan, 2018 12:14 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ నగదు బదిలీ  కేసు దర్యాప్తులో భాగంగా  ఆంధ్రా బ్యాంక్ మాజీ డైరెక్టర్ అనుప్ ప్రకాశ్ గార్గ్‌ను అరెస్ట్‌ చేసింది.  గుజరాత్‌కు చెందిన  ఫార్మ కంపెనీ స్టెర్లింగ్‌ బయెటెక్‌  కుంభకోణం కేసులో  ఈడీ  ఈ చర్య తీసుకుంది. సుమారు రూ.5వేల కోట్ల మేర  మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.

అక్రమ నగదు బదిలీ కేసు నమోదు చేసిన ఈడీ ఇప్పటికే ఈ కేసులో గత ఏడాది నవంబర్‌లో ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త గగన్ ధావన్‌ను అరెస్ట్‌ చేసింది. అలాగే గార్గ్‌ సహా,  స్టెర్లింగ్ బయోటెక్,డైరెక్టర్స్ చేతన్ జయంతిలాల్ సందేశర, దిపిటీ చేతన్ సందేశర, రాజ్‌భూషణ్ ఓంప్రకాష్ దీక్షిత్, నితిన్ జయంతిలాల్ సందేశర, విలాస్ జోషి, చార్టర్డ్ అకౌంటెంట్ హేమంత్ హాథి, మరికొంతమందిపై  సీబీఐ  కేసు నమోదు చేసింది. ఆంధ్రా బ్యాంక్ నాయకత్వంలోని కన్సార్టియం ద్వారా  రూ.5 కోట్ల బ్యాంక్‌ అక్రమాలతోపాటు, సందేశర బ్రదర్స్‌ ద్వారా గార్గ్‌కు 2011లో రూ.1.52కోట్ల ముడుపులు ముట్టాయని సీబీఐ గుర్తించింది. డిసెంబర్ 31, 2016 నాటికి  గ్రూప్ కంపెనీల పెండింగ్‌లో ఉన్న మొత్తం రుణాలు రూ. 5,383 కోట్లుగా సీబీఐ తన ఎఫ్‌ఐఆర్‌ లో పేర్కొంది. సిబిఐ  విచారణ చతర్వాత ఈడీ నగదు బదిలీ కేసు నమోదు చేసింది.

మరిన్ని వార్తలు