ఆధార్‌ లేదని ఆ మూడు తిరస్కరించవద్దు

12 Feb, 2018 10:38 IST|Sakshi
ఆధార్‌ కార్డు (ఫైల్‌ ఫోటో)

యూఐడీఏఐ హెచ్చరిక

ఆధార్‌ లేకపోతే... ఇటీవల కనీస సౌకర్యాలు కూడా అందడం లేదు. దీంతో ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంతమంది రేషన్‌ రాక, ఆకలి తట్టుకోలేక మృత్యువు బారిన కూడా పడుతున్నారు. అయితే ఆధార్‌ లేకపోయినా..... కనీస సేవలు కచ్చితంగా ఇవ్వాల్సిందేనని యూఐడీఏఐ ఆదేశాలు జారీచేసింది. ఆరోగ్య సేవలు, స్కూల్‌ అడ్మినిషన్లు, తక్కువ ధరలకు రేషన్‌ ఈ మూడు సర్వీసులను ఆధార్‌ లేకున్నా తప్పక ఇవ్వాల్సిందేనని పేర్కొంది. ఆధార్‌ నెంబర్‌ లేదని, కనీస సేవలు తిరస్కరించవద్దని అధికారిక ప్రకటన విడుదల చేసింది. కొన్ని ప్రభుత్వ ఏజెన్సీలు ఆధార్‌ లేకపోవడంతో, లబ్దిదారులకు సామాజిక సర్వీసులు అందించడం లేదు. 

అయితే నిజమైన లబ్ధిదారుడికి ఆధార్‌ లేదని ప్రయోజనాలను తిరస్కరించకూడదని ప్రభుత్వ ఏజెన్సీలకు 2017 అక్టోబర్‌ 24నే యూఐడీఏఐ నోటిఫికేషన్‌ జారీచేసింది. ఆధార్‌ లేదని, నిజమైన లబ్దిదారున్ని ఆసుపత్రిలో చేర్చుకోలేదని మీడియా రిపోర్టులు వెలువడిన సంగతి తెలిసిందే. గుర్గావ్‌లో ప్రభుత్వ ఆసుపత్రి ఆధార్‌ లేదని ఓ నిండు గర్భిణిని అడ్మిట్‌ చేసుకోవడానికి నిరాకరించింది. దీంతో ఆమె గేటు వద్దే ప్రస్తావించింది. దీనిపై పెద్ద ఎత్తున్న నిరసనలు వ్యక్తమయ్యాయి. ఇదే విషయంపై మరోసారి యూఐడీఏఐ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల కార్యదర్శులకు లేఖ రాసింది. ఆధార్‌ లేకపోతే, బేసిక్‌ సర్వీసులు అందించడం తిరస్కరించవద్దని హెచ్చరించింది. 

మరిన్ని వార్తలు