శ్రీసిటీ సెజ్ ప్రగతి హర్షణీయం...

21 Sep, 2014 01:05 IST|Sakshi
శ్రీసిటీ సెజ్ ప్రగతి హర్షణీయం...

తడ: అనతి కాలంలోనే శ్రీసిటీ సెజ్ సాధించిన ప్రగతి అభినందనీయుమని కేంద్ర ఆహార శుద్ధి, పరిశ్రవుల శాఖ వుంత్రి హర్ సివ్రుత్ కౌర్ బాదల్ అన్నారు. శనివారం ఆమె  చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీ సెజ్‌లో పర్యటించారు. సెజ్‌లో నెలకొల్పిన కాడ్బరీ, పెప్సికో, కెల్లాగ్స్ తదితర ఆహార, పానీయు ఉత్పాదక సంస్థల ప్రతినిధులతో సవూవేశమై పలు అంశాలను చర్చించారు.  

ఆహార, పానీయు ఉత్పాదనలకు ప్రత్యేక ప్రాంగణం ఏర్పాటు చేయుడం, ఈ తరహా ఉత్పాదక సంస్థలకు అనుకూలంగా వసతులు కల్పించడంతో శ్రీసిటీ ప్రత్యేకతను సంతరించుకుందన్నారు. శ్రీసిటీ సెజ్‌లో మౌలిక వసతులు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నాయని పేర్కొన్నారు.  అందుకే ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు వివిధ దేశాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు ఉత్సాహం చూపుతున్నారన్నారు.  నిపుణులైన సిబ్బంది లభ్యం కావాలంటే ఇందుకు అనుగుణంగా ప్రత్యేక సంస్థలను ఏర్పాటు చేసి స్థానికులకు శిక్షణ ఇప్పించాలని సూచించారు. అంతకువుుందు వుంత్రికి శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి సెజ్ సాధించిన ప్రగతిని వివరించారు.  

ఆహార,పానీయు పరిశ్రవులు శ్రీసిటీలో ఏర్పాటవడంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయున్నారు. వూమిడి, చెరుకు,టమాట, డెయిరీ రైతులకు వురింత ఆదాయుం సవుకూరుతుందన్నారు. వుంత్రి పర్యటనలో తిరుపతి పార్లమెంట్ సభ్యుడు వరప్రసాద్, సత్యవేడు ఎమ్మెల్యే తలారి ఆదిత్య, రాష్ట్ర పరిశ్రవుల శాఖ వుుఖ్య కార్యదర్శి జేవీఎస్ ప్రసాద్, ఆహార శుద్ధి పరిశ్రవుల సహాయు కార్యదర్శి వెంకటేశ్వరులు తదితర అధికారులు ఉన్నారు. శ్రీసిటీ సెజ్‌లో పర్యటించిన తొలి కేంద్ర వుంత్రి హర్ సివ్రుత్ కౌర్ బాదల్.

మరిన్ని వార్తలు