నేను ఆ రేసులో లేను

17 May, 2018 10:00 IST|Sakshi
ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌, రఘురామ్‌ రాజన్‌( పాత ఫోటో)

సాక్షి,న్యూఢిల్లీ: బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్(బీఓఈ) గవర్నర్ గా కీలక భాధ్యతలు చేపట్టబోతున్నారన్న  వార్తలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురామ్‌ రాజన్   స్పందించారు. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ గవర్నర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలని తాను భావించడంలేదని  రాజన్‌ స‍్పష్టం చేశారు. షికాగో యూనివర్శిటీ ఉద్యోగంలో చాలా హ్యాపీగా ఉన్నానని తెలిపారు. అంతేకాదు  వాస్తవానికి తాను  ప్రొఫెషనల్ సెంట్రల్ బ్యాంకర్ని  కాదని  వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం అమెరికా యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న రఘురామ రాజన్‌ పేరు  ఇటీవల  వార్తల్లో నిలిచింది.  బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్(బీఓఈ) గవర్నర్ గా కీలక భాధ్యతలు చేపట్టబోతున్నారని  నివేదికలు వెలువడ్డాయి.  బీఓఈ గవర్నర్ గా మార్క్ కార్నీ పదవీకాలం వచ్చే ఏడాది ముగియనున్న ఈ నేపథ్యంలో యూనివర్శిటీ ఆఫ్ షికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో ఫైనాన్స్ ఫ్రొఫెసర్ గా ఉన్న  రఘురామ్ రాజన్  పేరు   ప్రముఖంగా వినిపించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు