పంచాయతీ ఎన్నికల్లో టీఎంసీ హవా

17 May, 2018 09:54 IST|Sakshi

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌ పంచాయతీ ఎన్నికల్లో టీఎంసీ హవా కొనసాగుతోంది. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు తృణమూల్‌ కాంగ్రెస్‌ 110 పంచాయతీలను గెలుచుకోగా.. 1200 స్థానాలకు పైగా అధిక్యంలో కొనసాగుతుంది. బీజేపీ 4 స్థానాలు గెలుచుకుని, 81 స్థానాల్లో ముందంజలో ఉంది. సీపీఐ(ఎం) 3 స్థానాలు గెలుచుకుని 58 స్థానాల్లో అధిక్యంలో ఉంది. 

కాగా గొడవలు, గందరగోళం మధ్య జరిగిన పశ్చిమ బెంగాల్‌ పంచాయతీ ఎన్నికలకు ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ప్రారంభమైంది. సోమవారం జరిగిన ఎన్నికలు చాలా చోట్ల ఘర్షణ వాతావరణంలోనే జరిగాయి. పంచాయతీ ఎన్నికల్లో జరుగుతున్న ఘర్షణలపై ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారంటూ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమత బెనర్జీపై తీవ్రంగా మండిపడ్డారు. 2019 ఎన్నికలకు ముందు జరుగుతున్న ఎన్నికలైనందున అన్ని పార్టీలు వీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు