గోల్డ్ డిపాజిట్, బాండ్లపై వడ్డీరేటు 3% లోపే!

11 Sep, 2015 01:32 IST|Sakshi
గోల్డ్ డిపాజిట్, బాండ్లపై వడ్డీరేటు 3% లోపే!

న్యూఢిల్లీ: పసిడి డిపాజిట్ స్కీమ్, బాండ్లపై వడ్డీరేట్లు ఎంత ఉండవచ్చన్న అంశంపై ఆర్థికశాఖ సీనియర్ అధికారుల నుంచి కొన్ని సంకేతాలు అందాయి. పసిడి డిపాజిట్‌పై ఈ రేటు 1.5 శాతం నుంచి 2 శాతం వరకూ ఉండవచ్చని ఆ వర్గాల కథకం. గోల్డ్ బాండ్లపై వడ్డీరేటు 2 నుంచి 3 శాతం వరకూ ఉండే అవకాశం ఉందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. దీపావళి నాటికి కొత్త స్కీమ్‌లను ప్రారంభించడానికి కసరత్తు జరుగుతున్నట్లు ఆయన వెల్లడించారు. సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ ద్వారా ప్రభుత్వం రూ.15,000 కోట్ల సమీకరణ లక్ష్యంగా పెట్టుకుంది. 2015-16 బడ్జెట్ ప్రతిపాదనలకు అనుగుణంగా ఈ రెండు స్కీమ్‌లను బుధవారం కేంద్రం కేబినెట్ ఆమోదించిన సంగతి తెలిసిందే. రెండు నెలల్లో ఈ పథకాలు నోటిఫై అవుతాయని, ప్రజల స్పందన ఎలా ఉందన్న అంశాన్ని ఏడాది అనంతరం సమీక్షించడం జరుగుతుందని సీనియర్ ఆర్థికశాఖ అధికారి తెలిపారు.

మరిన్ని వార్తలు