భారీగా క్షీణించిన బంగారం, వెండి ధర!

6 Oct, 2014 13:52 IST|Sakshi
భారీగా క్షీణించిన బంగారం, వెండి ధర!
ముంబై: అమెరికా ఆర్ధిక వ్యవస్థలో సానుకూల జాబ్ డేటా ప్రభావంతో డాలర్ బలపడటంతో బులియన్ మార్కెట్ క్షీణించింది. బులియన్ మార్కెట్ లో బంగారం ధర సోమవారం 15 నెలల కనిష్ట స్థాయికి చేరుకుంది. రష్యా, ఉక్రెయిన్, సిరియా సంక్షోభాల నేపథ్యంలో బంగారం ధర పెరగకపోవడంపై మార్కెట్ విశ్లేషకులకు సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 
 
సోమవారం మధ్యాహ్నం సమయానికి 10 గ్రాముల బంగారం ధర 1.73 శాతంతో 467 రూపాయలు క్షీణించి 26534 వద్ద, బంగారం 2.1 శాతం నష్టంతో 814 రూపాయలు పతనమై 37888 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. ప్లాటినమ్ ధర కూడా 2009 నాటి కనిష్టాన్ని నమోదు చేసుకుంది. 
 
'డాలర్ బలపడటం బంగార ధరల క్షీణించడానికి కారణమవుతోంది. బులియన్ మార్కెట్ లో బేరిష్ సెంటిమెంట్ కోనసాగుతోంది. బంగారం ధరలు త్వరలో పుంజుకోవచ్చు' అని పలువురు మార్కెట్ విశ్లేషకులు వెల్లడించారు. జాతీయ సెలవు దినం కారణంగా చైనా మార్కెట్లు పనిచేయడం లేదు. చైనా మార్కెట్టు తిరిగి బుధవారం తమ వ్యాపార కార్యక్రమాల్ని బుధవారం ప్రారంభం కానున్నాయి. 

 

మరిన్ని వార్తలు