స్థిరంగా పసిడి

18 Jun, 2020 10:04 IST|Sakshi

అంతర్జాతీయ మార్కెట్లోనూ ఫ్లాట్‌ ట్రేడింగే..!

దేశీయ ఎంసీఎక్స్‌ మార్కెట్లో గురువారం పసిడి ధర స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. నేటి ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో 10గ్రాముల పసిడి ధర రూ.28 స్వల్ప నష్టంతో రూ.47310 వద్ద కదలాడుతోంది. పసిడి ధరకు ఇది వరుసగా 2రోజూ నష్టాల ట్రేడింగ్‌ కావడం గమనార్హం. అంతర్జాతీయంగా పసిడి ఫ్యూచర్లు ఫ్లాట్‌గా ట్రేడ్‌ అవుతుండం, ఈక్విటీ మార్కెట్ల ఒడిదుడుకుల ట్రేడింగ్‌ పసిడి ప్యూచర్ల స్థిరమైన ట్రేడింగ్‌కు తోడ్పాటును అందిస్తున్నాయి. నిన్నటి రోజున పసిడి ఫ్యూచర్లలో లాభాల స్వీకరణ కారణంగా రాత్రి ఎంసీఎక్స్‌లో 10గ్రాముల పసిడి ధర రూ.229లు క్షీణించి రూ.47338.00 వద్ద ముగిసింది. 

అంతర్జాతీయంగానూ ఫ్లాట్‌ ట్రేడింగ్‌: 
అంతర్జాతీయ మార్కెట్లోనూ పసిడి ధర ఫ్లాట్‌గా ట్రేడ్‌ అవుతోంది. ఆసియాలో నేటి ఉదయం ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర 1డాలరు స్వల్ప నష్టంతో 1,734.75డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కరోనా వైరస్‌ రెండో దశ వ్యాప్తితో ఇన్వెస్టర్లు ఆర్థిక వృద్ధిపై ఆందోళన వ్యక్తం పరస్తూ పసిడి కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు. అయితే ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ తిరిగి రికవరి కావడంతో పసిడి లాభాల్ని హరించి వేస్తుందని అంతర్జాతీయ బులియన్‌ పండితులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని వార్తలు