తగ్గనున్న ఎలక్ట్రిక్ వాహనాల ధరలు

26 May, 2017 16:39 IST|Sakshi
తగ్గనున్న ఎలక్ట్రిక్ వాహనాల ధరలు
ఎలక్ట్రిక్ వాహనాల ధర తగ్గింపుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. లిథియం-అయాన్ బ్యాటరీలను భారత్ లో స్థాపించడానికి తయారీదారులకు ప్రోత్సహకాలు ఇవ్వాలని ప్రభుత్వం చూస్తోంది. ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నాలతో చైనీస్ కారు తయారీదారులు భారత మార్కెట్లోకి ఎంటర్ కావడం ఇక నిరాశజనకంగా మారనుంది. తక్కువ ధర లిథియం-అయాన్ బ్యాటరీల అభివృద్ధి ప్రణాళికలపై మాట్లాడిన కేంద్ర భారీ పరిశ్రమల మంత్రి అనంత్ జీత్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ తయారుచేసిన బ్యాటరీలను రీమోడల్ చేసే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిపారు. ఇవి ఎలక్ట్రిక్ వాహనాల్లో  ఉపయోగపడతాయని చెప్పారు. రూ.100 కోట్ల పెట్టుబడులతో భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ తో కలిసి లిథియం-అయాన్ బ్యాటరీ తయారీ సౌకర్యాన్ని ఏర్పాటుచేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.
 
లిథియం బ్యాటరీలను తయారుచేయడానికి  దేశీయ ఆటో దిగ్గజం మారుతీ కూడా రెండు లక్షల కోట్లను పెట్టుబడులుగా పెట్టేందుకు సిద్ధమైనట్టు కూడా చెప్పారు. భారత్ లో లిథియం-అయాన్ బ్యాటరీ సౌకర్యాలను కల్పించడానికి పెట్టుబడులు పెట్టే దేశీయ కారు తయారీదారులకు ప్రోత్సహకాలు అందించేందుకు ప్లాన్ చేస్తున్నామని జీత్ పేర్కొన్నారు.  ఎఫ్ఏఎంఏ ఇండియా స్కీమ్స్ కింద దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల  ఉత్పత్తిని, అమ్మకాలను పెంచనున్నట్టు కూడా జీత్ చెప్పారు. ఎలక్ట్రిక్ టెక్నాలజీపై ఇప్పటికే చైనీస్  ఆటోమొబైల్ తయారీసంస్థలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి.
 
''లిథియం-అయాన్ బ్యాటరీలను తయారుచేస్తూ ప్రస్తుతం ఉన్న ఒకానొక దేశం చైనా మాత్రమే. ఎలక్ట్రిక్ మొబిలిటీని భారత్ లో పెంచితే, అది వారికి సంతోషం దాయకం. కానీ ఆ సంతోషాన్ని చైనాకు దీర్ఘకాలం ఇవ్వం. లిథియం-అయాన్ బ్యాటరీలను భారత్ లో మేమే చేపడతాం'' అని గీత్ తెలిపారు. ఎఫ్ఏఎంఈ ఇండియా స్కీమ్ ను 2015లో ప్రారంభించిన ప్రభుత్వం, దీనికింద ఎలక్ట్రిక్,హైబ్రిడ్ వాహనాలు బైకులకు 29,000 రూపాయల వరకు, కార్లకు రూ.1.38 లక్షల వరకు ప్రోత్సహకాలు అందిస్తోంది. 
మరిన్ని వార్తలు