అంచనాలను అందు​కోని హెచ్‌డీఎఫ్‌సీ

29 Jan, 2019 16:41 IST|Sakshi

సాక్షి, ముంబై:  ప్రయివేటు రంగ  బ్యాంకు హౌసింగ్‌ డెవలప్‌మెంట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌( హెచ్‌డీఎఫ్‌సీ)  ఫలితాల్లో  అంచనాలను అందుకోలేకపోయింది. వార్షిక ప్రాతిపదికన ఏకంగా 60శాతం నికర లాభాలను నష్టపోయింది.  అలాగే త్రైమాసిక ప్రాతిపదికన ప్రస్తుతం నికర లాభం 14 శాతం తగ్గినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.

ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో రూ. 2114 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2017-18) క్యూ3లో నికర లాభం రూ. 5,300 కోట్లుగా నమోదైంది. ఇందుకు హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఐపీవో ద్వారా లభించిన రూ. 3675 కోట్లు సహకరించాయి. నికర వడ్డీ ఆదాయం 17 శాతం పుంజుకుని రూ. 3192 కోట్లను తాకగా.. మొత్తం ఆదాయం 20 శాతం పెరిగి రూ. 10450 కోట్లకు చేరింది. త్రైమాసిక ప్రాతిపదికన పన్ను వ్యయాలు రూ. 1022 కోట్ల నుంచి రూ. 755 కోట్లకు దిగివచ్చాయి. నికర వడ్డీ మార్జిన్లు 3.5 శాతం వద్ద నిలకడగా నిలిచాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 1.15 శాతం నుంచి 1.22 శాతానికి పెరిగాయి.  ఈ ఫలితాల నేపథ్యంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు 1.31 శాతం నష్టపోయింది. అయితే చివరలో పుంజుకుంది. 

మరిన్ని వార్తలు