హోటల్‌ గదుల బుకింగ్‌ స్టార్టప్‌ ‘రూమ్స్‌టునైట్‌’ మూసివేత

22 Mar, 2017 00:58 IST|Sakshi
హోటల్‌ గదుల బుకింగ్‌ స్టార్టప్‌ ‘రూమ్స్‌టునైట్‌’ మూసివేత

న్యూఢిల్లీ: చివరి నిమిషంలో హోటల్‌ గదుల బుకింగ్‌కు వీలు కల్పించే మొబైల్‌ యాప్‌ ‘రూమ్స్‌టునైట్‌’ కార్యకలాపాలు అర్థంతరంగా నిలిచిపోయాయి. 1.5 కోట్ల డాలర్ల (రూ.100 కోట్లు) నిధుల సమీకరణలో విఫలం కావడం, ఉన్న పరిమిత నిధులు కాస్తా ఆవిరైపోవడంతో సంస్థ తన కార్యకలాపాలను నిలిపేసింది. గూగుల్‌ ప్లే స్టోర్, యాపిల్‌ యాప్‌ స్టోర్‌లలో సంస్థ యాప్‌ అందుబాటులో లేదు. సంస్థ వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేసినా... బుకింగ్‌కు సంబంధించిన ఫంక్షన్లు పనిచేయడం లేదు.

బెంగళూరు కేంద్రంగా రూమ్స్‌టునైట్‌ కార్యకలాపాలు 2015లో ప్రారంభం కాగా, దేశవ్యాప్తంగా 325 ప్రాంతాల్లోని 4,000 హోటళ్లు కంపెనీ నెట్‌వర్క్‌ పరిధిలో ఉన్నాయి. సీఈఓగా దీని వ్యవస్థాపకుడు సురేష్‌జాన్‌ వ్యవహరిస్తున్నారు. 90–95 మంది ఉద్యోగులను ఐడీఎస్‌ నెక్స్‌›్ట బిజినెస్‌ సొల్యూషన్స్‌ అనే మరో కంపెనీకి బదలాయించారు.

>
మరిన్ని వార్తలు