భారత్‌లో అఫ్తాన్‌ ఎంబసీ శాశ్వతంగా మూత, కాంగ్రెస్‌ రియాక్షన్‌

24 Nov, 2023 13:35 IST|Sakshi

Afghanistan Embassy అఫ్ఘానిస్తాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్‌లోని న్యూఢిల్లీ తన రాయబార కార్యాలయాన్ని శాశ్వతంగా మూసి వేసింది. ఈ విషయాన్ని ఆ దేశ రాయబార కార్యాలయం ట్విటర్‌ ద్వారా అధికారికంగా ప్రకటించింది. అక్టోబర్ 1 నుండి తన కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు సెప్టెంబర్ 30న ఎంబసీ చేసిన ప్రకటన తరువాత తాజా నిర్ణయం తీసుకుంది.  

భారత ప్రభుత్వం నుండి నిరంతర సవాళ్లను ఉటంకిస్తూ న్యూఢిల్లీలోని తన దౌత్య మిషన్‌ను శాశ్వతంగా మూసివేస్తున్నట్లు భారతదేశంలోని అఫ్ఘానిస్తాన్  రాయబార కార్యాలయం  ప్రకటించింది. నవంబర్ 23 నుండి అమల్లో ఉంటుందని తెలిపింది. దురదృష్టవశాత్తు, ఎనిమిది వారాల నిరీక్షంచినప్పటికీ దౌత్యవేత్తలకు వీసా పొడిగింపు , భారత ప్రభుత్వ ప్రవర్తనలో మార్పు లేదని తెలిపింది

కాంగ్రెస్ రియాక్షన్
ఈ ప్రకటన తరువాత, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎంపీ మనీష్ తివారీ బీజేపీపై విమర్శలకు దిగారు. అధికార బీజేపీ సహాయనిరాకరణ కారణంగా  ఈ నిర్ణయం తీసుకుందని ఆరోపించారు.  ఇది స్పష్టంగా కాబూల్‌లోని తాలిబాన్ ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకునే ప్రయత్నమని విమర్శించారు.  అంతర్జాతీయ వేదికలపై భారతదేశం ఎపుడూ  నైతికత విలువలకు, సూత్రాలకు కట్టుబడి ఉందన్నారు.

మరిన్ని వార్తలు