హువావే దూకుడు : 8కే 5జీ స్మార్ట్‌ టీవీలు

3 May, 2019 20:02 IST|Sakshi

చైనాకు చెందిన దిగ్గజ స్మార్ట్‌ఫోన్స్ తయారీ కంపెనీ హువావే  స్మార్ట్ టీవీ వ్యాపారంలోకి ఎంట్రీ ఇవ్వనుంది. అమెరికా దిగ్గజం యాపిల్ కంపెనీని వెనక్కు నెట్టి ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీగా  అవతరించిన హువావే ప్రపంచంలోనే తొలి  5జీ సపోర్ట్‌ టీవీని ఆవిష్కరించేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది.

హువావే అదిరిపోయే స్మార్ట్ టీవీలను మార్కెట్‌లోకి  తీసుకు రానుందని నికాయ్ ఏషియన్ రివ్యూ నివేదించింది.  5జీ సపోర్ట్ ఫీచర్‌తో 8కే స్మార్ట్ టీవీని  త్వరలోనే ఆవిష్కరించనుంది.   దీని ప్రకారం  కంపెనీ తన మేట్ 20ఎక్స్ 5జీ, ఫోల్డబుల్ మేట్ ఎక్స్ 5జీ స్మార్ట్‌ఫోన్ల  మాదిరే ఈ టీవీల్లోనూ 5జీ మాడ్యూల్స్‌ను అమర్చనుంది. ఈ అంచనాలు నిజమైతే 5జీ,  హైఎండ్‌ రిజల్యూషన్‌ డిస్‌ప్లే,  గిగాబిట్ సామర‍్థ్యంతో వైర్‌లెస్‌ స్టాండర్ట్‌  కేపబుల్‌ టీవీని ఆవిష్కరించిన కంపెనీగా హువావే చర్రిత సృష్టించనుందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో శాంసంగ్ కంపెనీకి గట్టి పోటీ ఎదురు కానుంది.

కాగా ప్రపంచంలోని అతిపెద్ద స్మార్ట్‌ఫోన్స్ తయారీ కంపెనీల్లో ఒకటైన హువావే అమ్మకాలు 2019 తొలి త్రైమాసికంలో వార్షిక ప్రాతిపదికన 50 శాతం వృద్దిని సాధించి యాపిల్‌ను సైతం వెనక్కి నెట్టిన సంగతి తెలిసిందే. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు