అంచనాలు మిస్‌: ఐసీఐసీఐ లాభాలు 56శాతం క్షీణత

26 Oct, 2018 20:52 IST|Sakshi

సాక్షి, ముంబై: వీడియోకాన్‌రుణాల వివాదంలో ఇరుక్కున్న  ప్రయివేటుబ్యాంకు దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకు లిమిటెడ్ రెండో త్రైమాసికం ఫలితాల్లో అంచనాలును అందుకోలేక చతికిల పడింది. సెప్టెంబరు30తో ముగిసిన  క్యూ2లో నికరలాభం 55.84 శాతంక్షీణించి రూ .908.88 కోట్లు ఆర్జించింది. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో రూ .2,058 కోట్లను ఆర్జించింది. ఆదాయం కూడా 39.14 శాతం క్షీణించి రూ .3,156.49 కోట్లకు చేరింది. అంతకు ముందు సంవత్సరం ఇది 5186.24 కోట్ల రూపాయలు.

నికర వడ్డీ ఆదాయం లేదా డిపాజిట్లపై చెల్లించిన వడ్డీ మధ్య వ్యత్యాసం 12.41 శాతం పెరిగి రూ .5,709కోటట్లనుంచి రూ .6,418 కోట్లకు పెరిగింది. సెప్టెంబర్ త్రైమాసికంలో స్థూల నిరర్ధక ఆస్తులు (ఎన్.పి.ఎ.) 8.54 శాతం ఉండగా, జూన్ త్రైమాసికంలో 8.81 శాతం, ఏడాది క్రితం క్రితం 7.87 శాతం మాత్రమే. త్రైమాసికంలో కేటాయింపులు 11.30 శాతం క్షీణించి రూ .3,994.29 కోట్లకు చేరుకున్నాయి. అంతకు ముందు త్రైమాసికంలో 4,502.93 కోట్ల రూపాయలు. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో రూ. 5971.29 కోట్లు కేటాయించారు.

మరిన్ని వార్తలు