రూ 30,000 కోట్ల రుణాలు రద్దు చేసిన ఐడీబీఐ

19 Dec, 2018 09:48 IST|Sakshi

సాక్షి,ముంబై : మొండిబకాయిలతో సతమతమవుతున్న ప్రభుత్వరంగ ఐడీబీఐ బ్యాంక్‌ గత మూడున్నర సంవత్సరాల్లో రూ 30,000 కోట్ల రుణాలను రద్దు చేసినట్టు వెల్లడించింది. నిరర్ధక ఆస్తులు పెరగడంతో రుణాల జారీపై ఐడీబీఐ బ్యాంకును ఆర్బీఐ నియంత్రించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ప్రధమార్ధంలో రూ 9052 కోట్ల రుణాలను రద్దు చేసినట్టు ఆర్థిక ‍వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీకి బ్యాంకు నివేదించింది.

రద్దు చేసిన రుణాల్లో అత్యధికం మౌలిక, మెటల్స్‌ రంగాలకు చెందినవేనని బ్యాంకు వర్గాలు పేర్కొన్నాయి. నిరర్ధక ఆస్తులపై ఆర్బీఐ ప్రవేశపెట్టిన అసెట్‌ క్వాలిటీ రివ్యూ (ఏక్యూఆర్‌) అనంతరం ఆయా రుణాలను రద్దు చేసినట్టు పార్లమెంటరీ కమిటీకి ఐడీబీఐ బ్యాంక్‌ తెలిపింది. 2015-16లో బ్యాంకు నిరర్ధక ఆస్తులు 7.79 శాతం నుంచి ఈ ఏడాది మార్చి నాటికి 11,8 శాతానికి పెరిగాయని ఐడీబీఐ బ్యాంక్‌ పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసంలో బ్యాంకు జారీ చేసిన మొత్తం రుణాల్లో 31 శాతం మేర రూ 60,875 కోట్లకు నిరర్ధక రుణ బకాయిలు పేరుకుపోయాయని వెల్లడించింది.

మరిన్ని వార్తలు