పన్ను చెల్లింపుదారుల ఫిర్యాదుల సత్వర పరిష్కారం!

29 Oct, 2015 00:38 IST|Sakshi
పన్ను చెల్లింపుదారుల ఫిర్యాదుల సత్వర పరిష్కారం!

న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారుల ఫిర్యాదుల సత్వర పరిష్కారంపై ఆదాయపు పన్ను శాఖ దృష్టి పెట్టింది. ఈ మెయిల్ ఆధారిత ఫిర్యాదుల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని తన కస్టమర్ కేర్ సెంటర్లను ఆదేశించింది. ఆయా ఫిర్యాదులను తక్షణం ఐటీ శాఖ ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని సూచించింది. పన్ను సేవల మెరుగుదలకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా తాజా ఆదేశాలు ఇచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

పాన్ స్టేటస్, ట్యాక్స్ డిడక్షన్ అకౌంట్ నంబర్ అప్లికేషన్లు, ఆదాయపు పన్ను ఫైలింగ్ ప్రక్రియ, వెల్త్ ట్యాక్స్ రిటర్న్స్, రిఫండ్‌లకు సంబంధించిన సమాచారాన్ని తక్షణం అందుబాటులో ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని తన కస్టమర్ కేర్ సెంటర్లను ఆదేశించింది.

మరిన్ని వార్తలు