హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు 2% అప్

13 Jun, 2014 01:33 IST|Sakshi
హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు 2% అప్
  •  విజయవాడలో 0.6% క్షీణత   
  • ఎన్‌హెచ్‌బీ త్రైమాసిక నివేదిక
  • న్యూఢిల్లీ: హైదరాబాద్, ఢిల్లీ, ముంబై సహా దేశవ్యాప్తంగా 12 ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరలు జనవరి - మార్చి క్వార్టర్లో 7.1 శాతం వరకు పెరిగాయి. డిమాండు పెరగడమే ఇందుకు కారణమని నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్‌హెచ్‌బీ) నివేదికలో తెలిపింది. ఇదే త్రైమాసికంలో మరో 12 నగరాల్లో ధరలు తగ్గాయని పేర్కొంది.
     
    అక్టోబరు - డిసెంబరు క్వార్టర్‌తో పోలిస్తే జనవరి - మార్చి మధ్యకాలంలో అహ్మదాబాద్‌లో 6.1, చెన్నైలో 5.8, కోల్‌కతాలో 5.1, లక్నోలో 4.9, రాయిపూర్‌లో 4.4, ముంబైలో 3.2, నాగ్‌పూర్‌లో 2.9, డెహ్రాడూన్‌లో 2.7, హైదరాబాద్‌లో 2.2, ఢిల్లీలో 1.5, భోపాల్‌లో 1.3 శాతం ధరలు వృద్ధిచెందాయి. ఇదేకాలంలో జైపూర్‌లో 3.8, గువాహటిలో 3.75, బెంగలూరులో 3.6, మీరట్‌లో 3.5, భువనేశ్వర్‌లో 3.47, లూధియానాలో 3.3, కోయంబత్తూరులో 1.7, విజయవాడలో 0.6 శాతం మేరకు ఇళ్ల ధరలు క్షీణించాయి. ఫరీదాబాద్, కోచ్చిల్లో రేట్లు స్థిరంగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా 26 నగరాల్లో వివరాలను సేకరించింది.
     
    రియల్టీలోకి రూ.4,800 కోట్లు
    మార్చి క్వార్టర్లో దేశీయ రియల్టీ రంగంలోకి సుమారు 80 కోట్ల డాలర్ల (రూ.4,800 కోట్లు) పెట్టుబడులు వచ్చాయని సీబీఆర్‌ఈ సౌత్‌ఆసియా ఓ ప్రకటనలో తెలిపింది. ప్రైవేట్ ఈక్విటీల రూపంలో ఈ పెట్టుబడులు పెట్టారని పేర్కొంది.

మరిన్ని వార్తలు