ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్:భారత్‌ హై జంప్‌

31 Oct, 2017 19:34 IST|Sakshi

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్‌ లో  ఈ ఏడాది  భారత్‌ మెరుగైన స్థానాన్ని కొట్టేసింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్‌-2018  జాబితాను మంగళవారం సాయంత్రం ప్రపంచ బ్యాంకు  ప్రకటించింది.   190 దేశాలున్న ఈ  జాబితాలో ఇండియా  100 స్థానాన్ని దక్కించుకుంది. గత ఏడాది 130 స్థానంలో  ఉన్న భారత్‌ బిగ్‌ జంప్‌  చేసింది. 30 స్థానాలు ఎగబాకి టాప్‌ -100లో చోటు దక్కించుకుంది. 

దక్షిణ ఆసియాలో  టాప్‌ 100లో చోటు దక్కించుకున్న దేశంగా ఇండియా నిలిచిందని  ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ ప్రకటించారు. నిర్మాణాత్మక సంస్కరణలను చేపడుతున్న దేశంగా భారతదేశం నిలిచిందని ప్రపంచ బ్యాంకు నివేదిక పేర్కొందని జైట్లీ  వెల్లడించారు. 10 సూచికల్లో  తొమ్మిందిటిలో తన స్థానాన్ని మెరుగుపర్చుకుందని చెప్పారు. ముఖ్యంగా సంస్కరణల్లో టాప్‌ గా నిలిచింది.  ఇన్‌సాల్వెన్సీ పరిష్కారంలో 136నుంచి 103ర్యాంక్‌కు ఎగబాకింది.  విద్యుత్‌ కనెక్షన్‌ పొందడంలో 29వ ర్యాంకును దక్కించుకుందని,  వ్యాపారం ఆరంభంలో,   మైనార్టీ పెట్టుబడుదారుల రక్షణలో, ఆస్తుల నమోదులో  పురోగతి సాధించింది.  క్రెడిట్‌ పొందడంలో 44నుంచి 29ర్యాంకుకు చేరింది.  పన్నుల  చెల్లింపులో 172నుంచి 119 ర్యాంకును,  ఆస్తుల నమోదులో మాత్రం క్షీణించింది.

ప్రపంచ బ్యాంకు  డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ 10 సూచికల ఆధారంగా ఈ ఇండెక్స్‌ను  రూపొందిస్తుంది.  వ్యాపారాన్ని ప్రారంభించడం, నిర్మాణ అనుమతి, విద్యుత్ పొందడం, ఆస్తిని నమోదు చేయడం, క్రెడిట్ పొందడం, మైనారిటీ పెట్టుబడిదారులను రక్షించడం, పన్నులు చెల్లించడం, సరిహద్దుల్లో ట్రేడింగ్, ఒప్పందాలను అమలు చేయడం,  దివాలా తీర్మానం వీటిల్లోఉన్నాయి.  ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేకమంది ఆర్థికవేత్తలు, ఆడిటర్లు, సర్వే సంస్థల కృషితో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్‌ను ప్రపంచబ్యాంకు రూపొందిస్తుంది. వివిధ దేశాల్లో ఆర్థిక అభివృద్ధి, పరిపాలన, కార్మిక చట్టాల్లో చేపడుతున్న సంస్కరణలను అధ్యయనం చేస్తారు.

కాగా  2001లో మొదటిసారిగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్‌ను ప్రారంభించిన ప్రపంచబ్యాంకు 2003లో మొదటిసారి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిపోర్టును ప్రచురించింది. ప్రస్తుతం ఈ ఇండెక్స్‌లో ప్రపంచంలోని 190 దేశాలకు ర్యాంకులు ఇస్తుంది.  

మరిన్ని వార్తలు