దేశీ ఆటో పరికరాల కంపెనీలు భేష్‌.. కానీ

7 Jan, 2017 01:09 IST|Sakshi
దేశీ ఆటో పరికరాల కంపెనీలు భేష్‌.. కానీ

తక్కువ ఉత్పాదకత వల్లే భారత్‌ వెనుకబాటు
ప్రపంచ బ్యాంక్‌ నివేదిక

న్యూఢిల్లీ: గడిచిన దశాబ్ద కాలంలో భారతీయ ఆటోమొబైల్‌ పరికరాల సంస్థలు మెరుగైన రాణిస్తున్నాయని, అయితే తక్కువ ఉత్పాదకత వల్లే మిగతా దేశాలతో పోలిస్తే భారత్‌ వెనుకబడిపోతోందని ప్రపంచ బ్యాంకు ఒక నివేదికలో వెల్లడించింది. ఆటోమోటివ్‌ రంగానికి సంబంధించి దక్షిణాసియాలో భారత్‌ ఆధిపత్య స్థానంలో వెలుగొందుతోందని, దేశీయంగా ఈ రంగంపై దాదాపు 1.9 కోట్ల ఉద్యోగాలు ఆధారపడి ఉన్నాయని వివరించింది.

భారత్‌ కేంద్రంగా పనిచేసే ఆటో పరికరాల తయారీ సంస్థలు.. అగ్రస్థాయి ఒరిజినల్‌ పరికరాల తయారీ సంస్థల (ఓఈఎం) నుంచి సాంకేతికత అందిపుచ్చుకుంటాయని, వివిధ ఎగుమతి దేశాల్లో కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన ఉత్పత్తులు అందిస్తున్నాయని  తెలిపింది. ఈ నేపథ్యంలో బాష్‌ వంటి పలు అంతర్జాతీయ సంస్థలు కూడా తమ పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ) కేంద్రాలను భారత్‌కు తరలిస్తున్నాయని పేర్కొంది. అలాగే బీఎండబ్ల్యూ, మెర్సిడెస్, రెనో–నిస్సాన్, వోల్వో, జీఎం, ఫోర్డ్, హోండా కంపెనీలు కూడా ఇదే బాట పట్టే క్రమంలో ఉన్నాయని వివరించింది. ఈ పరిణామాలతో భారత్‌లో ఎలక్ట్రానిక్స్, మెషీనింగ్, టూలింగ్‌ రంగాలు మరింత ఆధునికత సంతరించుకుంటాయని అభిప్రాయపడింది.

మరిన్ని వార్తలు