డబ్ల్యుపీఐ డేటా: రూపాయి నష్టాల్లోకి

14 May, 2018 13:07 IST|Sakshi

సాక్షి,ముంబై: డాలర్‌తో రూపాయి మారకం విలువ సోమవారం ఉదయం లాభాలతో మొదలయ్యింది. అయితే టోకు ధరల ద్రవ్యోల్బణం  డేటా నిరాశపర్చడంతో  ప్రారంభ లాభాలనుంచి వెనక్కి తగ్గింది. లాభనష్టాల మధ్య ఊగిసలాడుతోంది. 10 గంటల సమయానికి 67.22 వద్ద కొనసాగినా..మళ్లీ నష్టాల్లోకి జారుకుంది. 0.02పైసలు క్షీణించి 67.34 వద్ద కొనసాగుతోంది. ఫారెక్స్ మార్కెట్‌లో రూపాయి విలువ 12 పైసలు బలపడి 67.21 దగ్గర ప్రారంభమయ్యింది.   శుక్రవారం ముగింపు  67.33తో పోల్చితే 0.06 శాతం బలపడింది. ఎగుమతిదారులు, బ్యాంకర్లు డాలర్లను అమ్మేందుకు క్యూ కట్టడం లాంటి సానుకూల అంశాల నేపథ్యంలో రూపాయి మారకం విలువ బలపడింది.  అయితే  టోకు ధరల ద్రవ్యో ల్బణం (డబ్ల్యూపీఐ) డేటా 3.18 వద్ద నాలుగునెలల గరిష్టాన్ని నమోదు చేయడంతో ట్రేడర్లు  అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారని నిపుణులు వెల్లడించారు. మరోవైపు  కర్ణాటక ఎన్నికల పోలింగ్‌, రేపు (మంగళవారం) కౌంటింగ్‌ నేపథ్యంలో దేశీయ ఈక్విటీ మార్కెట్లు లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి.  


 

మరిన్ని వార్తలు