భారీగా పడిపోతున్న రూపాయి

22 Sep, 2017 18:29 IST|Sakshi
భారీగా పడిపోతున్న రూపాయి
సాక్షి, ముంబై : రూపాయి విలువ నేటి ట్రేడింగ్‌లోనూ భారీగా పడిపోతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 81 పైసల నష్టంలో 65.08 వద్ద ట్రేడవుతోంది. గురువారం ముగింపు అనంతరం ఫ్లాట్‌గా ప్రారంభమైన రూపాయి విలువ ఒక్కసారిగా మరింత నష్టాల్లోకి జారుకుంది. ఫెడరల్‌ రిజర్వు షాక్‌తో గురువారం ట్రేడింగ్‌లోనే రూపాయి 54 పైసలు నష్టపోయి 64.81 వద్ద క్లోజైంది.  
అమెరికా ఆర్థిక వ్యవస్థ పనితీరు బాగుందని, ఈ ఏడాది ఒకసారి, వచ్చే ఏడాది  మూడుసార్లు ఫెడ్‌ ఫండ్‌ రేటు పెంపు ఖాయమని అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌ బుధవారం చేసిన ప్రకటన డాలర్‌ ఇండెక్స్‌ పెరుగుదలకు, రూపాయి పతనానికి దారితీశాయి. ఆ ప్రభావమే నేటి ట్రేడింగ్‌లోనూ కనిపిస్తోంది. బంగారం కూడా భారీగా నష్టపోతుంది. ఎంసీఎక్స్‌ మార్కెట్‌లో బంగారం ధరలు 216 రూపాయిలు నష్టపోతూ 29,558 రూపాయల వద్ద ట్రేడవుతున్నాయి. 
మరిన్ని వార్తలు