Today Gold and Silver Price: బంగారం, వెండి ధరలు: ఎన్నాళ్లీ ఒత్తిడి!

23 Sep, 2023 15:40 IST|Sakshi

Gold and silver prices today : దేశంలో బంగారం, వెండి ధరలు పెరుగుతూ,  తగ్గుతూ ఉన్నాయి.  హైదరాబాద్‌ మార్కెట్లో శనివారం  10గ్రాముల పసిడి (22 క్యారెట్లు) ధర రూ. 100 పెరిగి రూ. 54,950కి చేరింది. అలాగే 10 గ్రాముల (24 క్యారెట్లు) బంగారం ధర రూ. 110 పెరిగి రూ. 59,950 వద్ద ఉంది. అ టు వెండి ధరలు కూడా పుంజుకున్నాయి. దేశంలో కిలో వెండి ధర 300 రూపాయి ఎగిసి రూ. 75,800కి చేరింది.  ప్రస్తుతం హైదరాబాద్‌ మార్కెట్‌లో కిలో వెండి ధర 79,300గా ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.   

ఇటీవలి కాలంలో 60వేల మార్క్‌ను దాటేసిన 10 గ్రాముల గోల్డ్‌ ధరలో గత  కొన్ని రోజులుగా పసిడి ధరల్లో తీవ్ర ఒత్తిడి కొనసాగుతోంది. దీంతో రానున్న ఫెస్టివ్‌ సీజన్‌ , దీపావళి పెళ్లిళ్ల ముహూర్తాల నేపథ్యంలో బంగారం కొనాలో, వెయిట్‌ చేయాలో తెలియని అనిశ్చితి వినియోగదారుల్లో నెలకొంది. 

ఫెడ్‌ వడ్డీరేట్లు  ప్రస్తుతం యథాతథంగా ఉంచినప్పటికీ ద్రవ్యోల్బణం, ఆర్థిక అనిశ్చితి  నేపథ్యంలో మరోసారి వడ్డీ వడ్డన ఉంటుందనే అంచనాల మధ్య పసిడి ధరలపై ఒత్తిడి కొనసాగుతోందని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు , జాతీయ అంతర్జాతీయ పరిణామాలు, ఆర్థిక పరిస్థితులు, ఫెడ్‌ వడ్డీరేటు, రూపాయి, డాలరు కదలికలపై భారతీయ మార్కెట్‌లో పసిడి ధరలు ఆధారపడి ఉంటాయి. అలాగే ప్రపంచ బంగారం డిమాండ్, వివిధ దేశాలలో కరెన్సీ విలువలు, ప్రస్తుత వడ్డీ రేట్లు , బంగారు వాణిజ్యానికి సంబంధించిన ప్రభుత్వ నిబంధనలు వంటి అంశాలు  కూడా దోహదం చేస్తాయి.

మరిన్ని వార్తలు