ఇన్ఫోసిస్‌లో వేతన పెంపు అంతేనా..!

5 Jul, 2017 20:14 IST|Sakshi
ఇన్ఫోసిస్‌లో వేతన పెంపు అంతేనా..!
బెంగళూరు : ఐటీ రంగంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితి వల్ల, ఇన్ఫోసిస్‌ వేతన పెంపును క్వార్టర్‌ పాటు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. వాయిదా అనంతరం వేతన పెంపును కంపెనీ ఈ నెల నుంచి చేపట్టింది. సగటును ఉద్యోగుల వేతన పెంపును కంపెనీ 5 శాతం చేపట్టినట్టు తెలిసింది. ఇన్ఫోసిస్‌ ప్రత్యర్థి విప్రో కూడా ఇదే మేర పెంపును చేపడుతున్నట్టు వెల్లడైంది.  జాబ్‌ లెవల్‌ 6 ఉద్యోగుల(మేనేజర్లు, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు), అంతకంటే తక్కువ స్థాయి ఉద్యోగుల సమీక్షించిన వేతన పరిహారాలు జూలై నుంచి అమల్లోకి వస్తున్నాయి. సాధారణంగా ఏప్రిల్‌లో కంపెనీ ఇంక్రిమెంట్లను చేపడుతుంటూంది.
 
కానీ ఈ సారి ఇండస్ట్రీలో నెలకొన్న ఒత్తిళ్ల నేపథ్యంలో కంపెనీ క్వార్టర్‌ కాలం పాటు ఇంక్రిమెంట్లను వాయిదా వేసింది. అయితే ఈ ఇంక్రిమెంట్లు గతేడాది కంటే తక్కువగా ఉన్నాయని తెలిసింది. గతేడాది 6-12 శాతం మధ్యలో ఇంక్రిమెంట్లను కంపెనీ ఆఫర్‌ చేసింది. సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లకు(జాబ్‌ లెవల్‌ 7, అంతకంటే పైన) అసలు కంపెనీ ఇంక్రిమెంట్లనే చేపట్టడం లేదని సంబంధిత వర్గాలు చెప్పాయి. కొత్త పనితీరు నిర్వహణ వ్యవస్థ ఐకౌంట్‌ ద్వారా వ్యక్తిగతంగా ఓ ఉద్యోగి సహకారం ఏ మేర ఉంటుందో తెలుసుకోవడం కోసం కంపెనీ ఎక్కువగా దృష్టిసారించింది. ఫీడ్‌బ్యాక్‌లను కూడా కంపెనీ నిరంతరం తీసుకుంటూనే ఉంది. కంపెనీలో ఎక్కువ పనితీరు కనబర్చిన వారికి ఇంక్రిమెంట్లు 10 శాతం నుంచి 12 శాతం మధ్యలో ఉన్నాయని సంబంధిత వర్గాలు చెప్పాయి.    
మరిన్ని వార్తలు