ఐఆర్‌సీటీసీలో విమాన టికెట్లు

12 May, 2018 16:03 IST|Sakshi

సాక్షి, ముంబై: భారత రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ)  విమాన ప్రయాణికులకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. అవును మీరు చదివింది నిజమే.. దేశీయ, అంతర్జాతీయ విమానాల్లో  ప్రయాణించే వారికి  చల్లని కబురు చెప్పింది.  డొమెస్టిక్‌, ఇంటర్నేషనల్‌  విమాన టికెట్ల బుకింగ్‌పై నామమాత్రపు ఫీజును వసూలు  చేయనున్నామని ప్రకటించింది.   ఐఆర్సీటీసీ అధికారిక ట్విటర్‌  ద్వారా ఈ తీపి వార్తను  వినియోగదారులకు  అందించింది.

 వినియోగదారుడు నేరుగా ఐఆర్‌సీటీసీ ఎయిర్‌ వెబ్‌సైట్‌  (air.irctc.co.in) ద్వారా గానీ  ఐఆర్‌సీటీసీ ఎయిర్‌ యాప్‌ ద్వారా విమాన టిక్లెకు బుక్‌ చేసుకోవచ్చని ఐఆర్‌సీటీసీ వెల్లడించింది. ఇందుకు కేవలం  59 రూపాయల  నామమాత్రపు ఫీజును వసూలు చేయనున్నామని తెలిపింది. ఎలాంటి  హిడ్డెన్‌ చార్జీలు వుండవని  స్పష్టం చేసింది. ప్రతి విభాగంలోనూ   విమాన టికెట్ల బుకింగ్‌పై  భారీ సేవింగ్స్‌ను అందిస్తున్నట్టు తెలిపింది . వినియోగదారుల సౌలభ్యంకోసం  24గంటలు తమ సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొంది.  అంతేకాదు  కస్టమర్ల సమస్యలు, సందేహాల నివారణకోసం  1800110139  అనే టోల్‌ ఫ్రీ నెంబర్‌ను కూడా అందుబాటులో ఉంది. అలాగే  flights@irctc.co.in. అనే మెయిల్‌ ద్వారా కూడా తమను సంప్రదించవచ్చని  ఐఆర్‌సీటీసీ  ప్రకటించింది.

ఆన్‌లైన్‌ టికెట్ టిక్కెట్లను బుకింగ్‌ కోసం 50కిపైగా పేమెంట్‌ ఆప్షన్లను అందుబాటులో  ఉన్నాయనీ,   దాదాపు అన్ని ప్రధాన బ్యాంకుల నెట్ బ్యాంకింగ్‌తో  సహా అన్ని ప్రధాన కార్డుల చెల్లింపుల సౌలభ్యం  వెబ్‌సైట్‌, యాప్‌లో లభ్యమవుతాయని తెలిపింది. విమాన టికెట్ల బుకింగ్‌లో ఎల్‌టీసీ (ప్రయాణ రాయితీ) ధరల సదుపాయం కూడా అందుబాటులో ఉంచింది. దీంతోపాటు టికెట్‌ కాన్సిలేషన్‌,బుకింగ్‌  సదుపాయం సరళీకరణతో యూజర్లకు  ఫ్రెండ్లీ అనుభవాన్ని అందిస్తున్నామని పేర్కొంది.

మరిన్ని వార్తలు