సికింద్రాబాద్ నుంచి మూడు త్రీ స్టార్ లగ్జరీ ట్రైన్స్

1 Jul, 2016 15:16 IST|Sakshi
సికింద్రాబాద్ నుంచి మూడు త్రీ స్టార్ లగ్జరీ ట్రైన్స్

త్రీ స్టార్ లగ్జరీ ట్రైన్ లో తిరుపతికి, షిరిడీకి, గోవాకు వెళ్లాలని ఉందా.. అయితే ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్ సీటీసీ) ప్రయాణికుల కోసం ఓ వినూత్నమైన ఆఫర్ ను తీసుకొచ్చేసింది. సాధారణ బస్సు రేట్లతో సమానంగా సికింద్రాబాద్ నుంచి షిరిడీకి, తిరుపతికి, గోవాకు త్రీ స్టార్ లగ్జరీ ట్రైన్లను ఐఆర్ సీటీసీ ఆపరేట్ చేయనుంది. తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పేర్వారం రాములు స్పెషల్ రిక్వెస్ట్ తో ఐఆర్ సీటీసీ ఈ త్రీ స్టార్ లగ్జరీ ట్రైన్లు నడపడానికి సమ్మతించింది. ఐఆర్ సీటీసీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఏ.కే మనోచా, గ్రూప్ జనరల్ మేనేజర్ స్మితా రావత్ తో పేర్వారం రాములు భేటీ అనంతరం ఈ నిర్ణయం ప్రకటించారు. అదేవిదంగా తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు బాసర, వరంగల్, భద్రాచలం ప్రాంతాల్లో కూడా త్రీ స్టార్ లగ్జరీ రైళ్లను ఐఆర్ సీటీసీ నడిపేందుకు అంగీకరించింది.

లైఫ్ లో ఎప్పటికైనా ఓ సారి ఎక్కాల్సిన రైలుగా ప్రసిద్ధి చెందిన సెవన్ స్టార్ సూపర్ లగ్జరీ మహారాజా ఎక్స్ ప్రెస్ ట్రైన్ ను కొంకణ్ నుంచి కర్నాటక, కేరళ, తమిళనాడుకు తెలంగాణలోని సికింద్రాబాద్, కాజిపేట స్టేషన్ల మార్గాన ప్రయాణించేలా చర్చలు జరుగనున్నాయి. ఈ ప్రతిపాదనపై చర్చించేందుకే ఐఆర్ సీటీసీ సీఎండీ ఎ.కె మనోచా టీఎస్ టీడీసీ సందర్శించినట్టు తెలుస్తోంది. మహారాజ ఎక్స్ ప్రెస్ విలాసవంతమైన ట్రావెల్ ప్యాకెజ్ ను ప్రయాణికులకు ఆఫర్ చేస్తోంది. ఫుడ్, వైన్, టూరిస్ట్ ప్రాంతాల సందర్శన ఈ ట్రావెల్ ప్యాకెజ్ లో ఉన్నాయి. నోరూరించే చైనీస్, థాయ్, మొగలాయి, ఇండియన్ వంటకాలను ఈ ట్రైన్ మెనూలో ఆఫర్ చేస్తోంది. విలాసవంతమైన గదులను ఆఫర్ చేసినందుకు గాను కపుల్ కు రూ.66,760 లను చార్జ్ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు