జెట్‌ ఎయిర్‌వేస్‌ ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌ బై..బై

23 Nov, 2018 19:22 IST|Sakshi

రుణ సంక్షోభంలో కూరుకుపోయిన విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్ (ఇండియా) లిమిటెడ్ నెత్తిన మరో పిడుగుపడింది. ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌ రంజన్‌ మథాయి రాజీనామా చేశారు. బోర్డు స్వతంత్ర డైరక్టర్‌గా తన బాధ్యతలను నెరవేర్చడానికి అవసరమైన సమయాన్ని కేటాయించలేకపోతున్న కారణంగా బోర్డుకు రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు.    

ఒక వైపు కొండలా పెరుగుతున్న రుణభారం, మరోవైపు చమురు ధరల పెరుగుదల జెట్‌ ఎయిర్‌వేస్‌ను బాగా ప్రభావితం చేసింది. లాభాలు పడిపోయాయి. తీవ్ర నష్టాల్లో కూరుకపోయింది. దీంతో తనను తాను నిలబెట్టుకునేందుకు అష్టకష్టాలు పడుతోంది. ఉద్యోగులకు  జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితికి నెట్టబడింది. ఈ క్రమంలో టాటా గ్రూపునకు చెందిన టాటా సన్స్ లిమిటెడ్ జెట్‌లో వాటా కొనుగోలుకు ముందుస్తు చర్చలు ప్రారంభించినట్టు గత వారం ప్రకటించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు