కేటీఎం బైక్స్‌ లవర్స్‌కి బంపర్‌ ఆఫర్‌

6 Jul, 2017 19:50 IST|Sakshi
కేటీఎం బైక్స్‌ లవర్స్‌కి బంపర్‌ ఆఫర్‌

స్పోర్ట్స్‌ బైక్స్‌ అంటే ప్రాణం పెట్టే యూత్‌కు ఇది నిజంగా గుడ్‌ న్యూస్‌.   జీఎస్‌టీ కొత్త పన్నుల విధానం అమల్లోకిరావడంతో భారత్‌లో టాప్‌ గేర్‌లో దూసుకెళుతున్న కేటీఎం బ్రాండ్‌ బైక్‌ల ధరలు కూడా తగ్గాయి.  ఆస్ట్రియా కంపెనీ  కెటిఎం  కంపెనీ భారత్‌లో బైక్ల ధరలను  భారీగా తగ్గించిందని బజాజ్‌ ఆటో గురువారం ప్రకటించింది.   సుమారు రూ.8,600 వరకు తగ్గింపును ఆఫర్‌  చేస్తున్నట్టు తెలిపింది.  

 350 సీసీ ఎటిఎఫ్ కెటిఎమ్ పరిధిలో 200 డ్యూక్, ఆర్‌సీ 200, 250 డ్యూక్‌ ఎక్స్ షోరూమ్ ధరలపై  రూ.8,600ల మేరకు తగ్గాయని బజాజ్ ఆటో ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే అదనపు సెస్‌ కారణంగా 350 సీసీ పరిధిలోని  390 డ్యూక్ ,  ఆర్సి 390 ల ఎక్స్-షోరూమ్ ధరల్లో రూ. 5,900  మేర తగ్గించింది.ఆయా ప్రాంతాలల్ లోవర్తించే వ్యాట్ రేట్ల ఆధారంగా తగ్గింపు రేటు వేర్వేరుగా ఉంటుందని  కంపెనీ  తెలిపింది.  అయితే ముంబైలో 200  డ్యూక్‌ ఎక్స్-షోరూమ్ లో దీని అసలు ధర రూ.1,44,751గా ఉంది.

మరోవైపు ఇటీవలే దేశంలో అప్‌గ్రేడెడ్‌ వెర్షన్లను ప్రవేశపెట్టిన  కేటీఎం తన  ఔట్‌లెట్లను పెద్ద ఎత్తున విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తోంది.   ఇండియలో నెం.1 స్థానంపై కన్నేసిన కంపెనీ ఈఏడాది దాదాపు 50వేల బైక్‌లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అటు కేటీఎం బ్రాండ్‌లో బజాజ్‌ ఆటో కంపెనీకి 49 శాతం వాటా ఉంది.

​ కాగా  ఇప్పటికే ద్విచక్ర వాహన తయారీదారులైన టీవీఎస్ మోటార్ , హోండా మోటార్సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా, హీరో మోటో కార్ప్, బజాజ్ ఆటో, రాయల్ ఎన్‌ఫీల్డ్, యమహా, సుజుకి  కంపెనీలు తమ బైక్‌ల  ధరలను  తగ్గించాయి.
 

మరిన్ని వార్తలు