నేడు నిఫ్టీకి 8963-8897 వద్ద సపోర్ట్‌

27 May, 2020 08:48 IST|Sakshi

నేడు ఫ్లాట్‌ ఓపెనింగ్‌- ఆపై?

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 5 పాయింట్లు ప్లస్‌

యూఎస్‌, యూరోపియన్‌ మార్కెట్లు అప్‌

నేడు మే నెల డెరివేటివ్స్‌ ముగింపు

అటూఇటుగా ఆసియా మార్కెట్లు 

నేడు (బుధవారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు అక్కడక్కడే అన్నట్లు(ఫ్లాట్‌)గా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.30 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 5 పాయింట్ల నామమాత్ర లాభంతో 9,053 వద్ద ట్రేడవుతోంది. మంగళవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ మే నెల ఫ్యూచర్స్‌ 9,048 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను.. ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. ఈ ఏడాది ద్వితీయార్ధం నుంచీ ఆర్థిక వ్యవస్థలు బలపడనున్న అంచనాలతో మంగళవారం యూఎస్‌, యూరోపియన్‌ మార్కెట్లు 1.5 శాతం స్థాయిలో పుంజుకోగా.. ప్రస్తుతం ఆసియా మార్కెట్లు అటూఇటుగా ట్రేడవుతున్నాయి. దీంతో నేడు దేశీయంగా సెంటిమెంటు బలపడే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. గురువారం మే నెల డెరివేటివ్స్‌ ముగియనున్న కారణంగా ఇంట్రాడేలో ఆటుపోట్లకు చాన్స్‌ ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. 

హుషారుగా మొదలై 
ప్రపంచ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలతో మంగళవారం హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు చివరికి స్వల్ప నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 63 పాయింట్లు తక్కువగా 30,609 వద్ద నిలవగా.. నిఫ్టీ 10 పాయింట్లు క్షీణించి 9,029 వద్ద ముగిసింది. అయితే ట్రేడింగ్‌ ప్రారంభమైన కొద్ది నిముషాలలోనే సెన్సెక్స్‌ 400 పాయింట్లకుపైగా జంప్‌చేసింది. 31,087కు ఎగసింది. తదుపరి మిడ్‌సెషన్‌ నుంచీ బలహీనపడుతూ వచ్చింది. చివరికి లాభాలను వీడి నష్టాలలోకి ప్రవేశించింది. ఒక దశలో 30,512 వరకూ నీరసించింది. ఈ బాటలో నిఫ్టీ సైతం 9162- 8997 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది.

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 8,963 పాయింట్ల వద్ద, తదుపరి 8,897 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు పుంజుకుంటే నిఫ్టీకి తొలుత 9,128 పాయింట్ల వద్ద, ఆపై 9,227 వద్ద అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. 

కొనుగోళ్లవైపు..
నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 4716 కోట్లు, దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 2841 కోట్లు చొప్పున ఇన్వెస్ట్‌ చేశాయి. సోమవారం మార్కెట్లకు సెలవుకాగా.. శుక్రవారం ఎఫ్‌పీఐలు రూ. 1354 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. డీఐఐలు సైతం రూ. 344 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించిన విషయం విదితమే.

మరిన్ని వార్తలు