ఇండో- చైనా ఉద్రిక్తత : అమ్మకాలు 

16 Jun, 2020 16:00 IST|Sakshi

యుద్ధ భయాలతో నష్టాల్లోకి 

చివరకు నిలదొక్కుకున్న సూచీలు 

9900 ఎగువన ముగిసిన నిఫ్టీ

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లకు చైనా-ఇండియా ఉద్రిక్తత షాక్ తగిలింది. దీంతో ఆరంభ లాభాలనుంచి భారీగా వెనక్కి తగ్గింది. ఆరంభంలో 700 పాయింట్లకు పైగా సెన్సెక్స్ ఎగిసింది. నిఫ్టీ 200 పాయింట్లు పుంజుకుని తిరిగి 10వేల స్థాయికి తిరిగి చేరుకుంది.  కానీ రోజంతా ఊగిసలాట ధోరణి కొనసాగింది.

ప్రధానంగా ఇండో చైనా సరిహద్దు ఉద్రిక్తత ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేసింది. దీంతో ఒక దశలో నష్టాల్లోకి జారుకున్నాయి. చివరి గంటలో కోలుకుని చివరకు సెన్సెక్స్ 376 పాయింట్ల లాభాలకు పరిమితమై 33605 వద్ద, నిఫ్టీ 100 పాయింట్ల లాభంతో 9914వద్ద ముగిసింది. రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ ట్విన్స్, ఐసీఐసీఐ, ఇన్ఫోసిస్, కోటక్ బ్యాంక్. హీరో మోటోకార్ప్  టాప్ విన్నర్స్ గా నిలిచాయి. మరోవైపు ఫలితాల నేపథ్యంలో టాటా మెటార్స్ భారీగా నష్టపోయింది. ఇండస్ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్ర, యాక్సిస్ బ్యాంక్ , ఐటీసీ ఇతర నష్టపోయిన షేర్లు. డే గరిష్టం నుంచి సెన్సెక్స్‌ 1069 పాయింట్లు,  నిఫ్టీ 318 పాయింట్లు పతనమైంది.

మరిన్ని వార్తలు