వారమంతా నష్టాలే..10,250 కిందికి నిఫ్టీ

16 Mar, 2018 15:51 IST|Sakshi

సాక్షి,ముంబై:  ఈ వారాంతంలో స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఈ వారం మొత్తంలోభారీగా నష్టపోయిన కీలక సూచీలు ఇవాల్టి నష్టాలతో మరింత బలహీన సంకేతాలను అందించాయి.  సెన్సెక్స్‌ 510 పాయింట్లు  పతనం కాగా, నిఫ్టీ 165 పాయింట్ల నష్టపోయి 10250స్థాయిని కోల్పోయింది.  దాదాపు అన్ని సెక్టార్లు నష్టాల్లోనే ముగిశాయి.   మార్కెట్లో నెలకొన్ని  అమ్మకాల ఒత్తడి నిప్టీని 10వేల  కిందికి పడవేయనుందని ఎనలిస్టుల అంచనా.
కోల్‌ ఇండియా, ఐవోసీ, అల్ట్రాటెక్‌, టాటా  మోటార్స్‌, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌,  ఐబీ హౌసింగ్, అదానీ పోర్ట్స్‌, టాటా స్టీల్‌, గెయిల్‌, ఓఎన్‌జీసీ  నష్టపోగా,  ఎంఅండ్‌ఎం, అరబిందో, ఇన్‌ప్రాటెల్‌, యూపీఎల్‌, యస్‌బ్యాంక్‌, పవర్‌గ్రిడ్‌, బాష్‌  లాభాలతో ముగిశాయి.
 

మరిన్ని వార్తలు