చివర్లో కొనుగోళ్లు : మార్కెట్ల రీబౌండ్‌

28 May, 2019 15:47 IST|Sakshi

సాక్షి, ముంబై :  ఆరంభంలాభాల నుంచి  వెనక్కి తగ్గిన  స్టాక్‌మార్కెట్లు చివరికి లాభాల్లో ముగిశాయి.  లాభనష్టాల మధ్య ఊగిసలాడిన మార్కెట్లు  చివర్లో ఆఖరి గంటలో  నష్టాలనుంచి భారీగా పుంజుకున్నాయి. దీంతో సెన్సెక్స్‌, నిఫ్టీ కీలక మద్దతు స్థాయిలను నిలబెట్టుకున్నాయి. సెన్సెక్స్‌ 66 పాయింట్లు ఎగిసి 39749 వద్ద, నిఫ్టీ 4 పాయింట్లు లాభపడి 11928 వద్ద ముగిసింది. ముఖ్యంగా బ్యాంక్‌ నిఫ్టీ భారీగా ఎగిసింది. హెచ్‌డీఎఫ్‌సీ  లాభాలు బ్యాంక్‌నిఫ్టీకి బలాన్నిచ్చాయి.  ఎస్‌బ్యాంకు. ఇండస్‌, ఆర్‌బెల్‌,కోటక్‌, ఐసీఐసీఐ, యాక్సిస్‌, ఎస్‌బీఐ బ్యాంకింగ్‌ షేర్లు లాభపడ్డాయి. ఇన్ఫీ, విప్రో, అదానీ, రిలయన్స్‌, డిష్‌టీవీ,  లాభాల్లో ముగిసాయి.

మరోవైపు డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ప్రమోటర్లు లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ అయ్యాయన్నవార్త నేపథ్యంలో భారీగా నష్టపోయింది. దీంతోపాటు భారతి ఇన్‌ఫ్రాటెల్‌, హీరో మోటో, ఎంఅండ్‌ ఎం,  టాటా మోటార్స్‌ ,  బజాజ్‌ ఫిన్‌, ఎల్ అండ్‌టీ,  గ్రాసిం, పీఎన్‌బీ, స్పైస్‌జెట్‌ నష్టపోయాయి.

మరిన్ని వార్తలు