మెర్సిడెస్ బెంజ్ ఏఎమ్‌జి ఎస్‌ 63 కుపే

19 Jun, 2018 09:13 IST|Sakshi

న్యూఢిల్లీ : జర్మనీకి చెందిన లగ‍్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్-బెంజ్ మరో సరికొత్త కారును  విడుదల చేసింది. కూపే వేరియంట్లో  ఏఎంజీ సిరీస్‌లో ‘ ఏఎంజీ  ఎస్‌ 63 కూపే ’పేరుతో ఖరీదైన కారును  దేశీయ మార్కెట్లో లాంచ్‌ చేసింది.  రూ. 2.55 కోట్ల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ధరతో ఈ కారును ప్రారంభించింది. తద్వారా ఏఎంజీ పోర్ట్‌ఫోలియోను 15కు విస్తరించింది. ఈ సందర్భంగా కంపెనీ వైస్ ప్రెసిడెంట్ మిచెల్ జోప్  మాట్లాడుతూ మెర్సిడెస్-ఏఎంజీకి భారత్‌లో చాలా అనూహ్యమైన మార్కెట్ ఉందన్నారు. ఇకనుంచి భారత మార్కెట్లోకి విడుదల చేసే ప్రతి డీజిల్ కారు బీఎస్-6ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించనున్నామని చెప్పారు.

ట్విన్‌ టర్బో 5.5లీటర్ల ఇంజీన్‌కు బదులుగా  4లీటర్ల వీ8 బిటుర్బో ఇంజిన్‌తో తయారుచేసిన ఈ కారు కేవలం 3.5 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుటుంది., అలాగే గంటకు 300  కిలోమీటర్ల గరిష్టవేగాన్ని అందిస్తుంది. నాలుగు వైపులా 20-అంగుళాల పరిమాణంలో ఉన్న 5-స్పోక్ అల్లాయ్ వీల్స్  స్పెషల్‌ ఎట్రాక్షన్, ‌9-స్పీడ్ ఏఎమ్‍‌జి స్పీడ్‌ షిఫ్ట్ మల్టీ క్లచ్ ట్రాన్స్‌మిషన్‌ తోపాటు ఇతర సేఫ్టీ ఫీచర్లను కూడా అమర్చింది.

2015 నాటికి మెర్సిడెస్ అతిపెద్ద విక్రయ లగ్జరీ కార్ బ్రాండ్‌గా పేరు గాంచింది. 2017 లో దేశంలో లగ్జరీ కార్ మార్కెట్లో టాప్ 15,300 యూనిట్లు విక్రయించగా, అందులో బీఎండబ్ల్యూ 9,800 యూనిట్లు, ఆడి 7,876 యూనిట్లు విక్రయాలు నమోదుయ్యాయి. ఈ క్యాలెండర్ సంవత్సరంలో మొదటి మూడు నెలల్లో మెర్సిడెస్ 4556 యూనిట్ల అమ్మకాలు 25 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇది త్రైమాసికంలో కంపెనీ అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా మెర్సిడెస్ 1.33 లక్షల ఏంఎజీ కార్లు అమ్ముడుపోగా  ఇండియాలో  400 పైగా యూనిట్లను మాత్రమే విక్రయించింది.

మరిన్ని వార్తలు