మూలధన నిధులతో మరింత రుణ వృద్ధి: జైట్లీ

16 Dec, 2017 00:48 IST|Sakshi

న్యూఢిల్లీ: రుణ వృద్ధి, ఉద్యోగ కల్పనలను  మరింతగా మెరుగుపరచానికే ప్రభుత్వ రంగ బ్యాంక్‌లకు మూలధన నిధులు అందిస్తున్నామని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ చెప్పారు.  మూలధన బాండ్లు, బడ్జెట్‌ కేటాయింపులు, మార్కెట్‌ ద్వారా నిధుల సమీకరణ ద్వారా బ్యాంక్‌లకు వచ్చే రెండేళ్లలో రూ.2.11 లక్షల కోట్ల మూలధనం అందించనున్నామని వివరించారు.

దీంతో ఆర్థిక వ్యవస్థకు కీలకమైన బ్యాంక్‌లు పటిష్టమవుతాయని పేర్కొన్నారు. బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థల ప్రతినిధులతో బడ్జెట్‌ ముందస్తు సంప్రదింపుల సందర్భంగా ఆయన ఈ విషయాలు వెల్ల డించారు. బ్యాంక్‌ వడ్డీపై ప్రస్తుతం రూ. 10,000 వరకూ ఉన్న ప్రస్తుత టీడీఎస్‌ను మరింతగా పెంచాలన్న మనవి బ్యాంక్‌ ప్రతినిధుల నుంచి వచ్చింది.    

మరిన్ని వార్తలు