ఎన్‌డీటీవీని అమ్మేశారా?

22 Sep, 2017 17:11 IST|Sakshi
ఎన్‌డీటీవీని అమ్మేశారా?

సాక్షి, న్యూఢిల్లీ:  ఎన్‌డీటీవీని (న్యూఢిల్లీ టెలివిజన్‌ లిమిటెడ్‌) స్పైస్జెట్ సహ వ్యవస్థాపకులు అజయ్ సింగ్ కొనుగోలు చేశారన్న వార్తలు  ఒక్కసారిగా మీడియాలో గుప్పు మన్నాయి.  టీవీలో  మెజారిటీ వాటాను అజయ్‌ సింగ్‌  కొనుగోలు చేశారని వార‍్తలు వచ్చాయి.

ఈ ఒప్పందం ప్రకారం అజయ​ సింగ్‌ 40శాతం వాటాను,  ప్రణయ్‌రాయ్‌, రాధికా రాయ్‌  సుమారు 20శాతం వాటాను కలిగి వుంటారని అంచనాలు  వెలువడ్డాయి.   డీల్‌ లో భాగంగా  ఎన్‌డీటీవీకి చెందిన రూ.400 కోట్లు అప్పును కూడా అజయ్‌ స్వీకరించారని, మొత్తం డీల్‌  విలువ రూ.600 కోట్ల  అని మీడియాలో కథనాలు జోరుగా వ్యాపించాయి. దీంతో ఎన్‌డీటీవీ షేర్   భారీగా ఎగిసింది.  ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో షేర్‌ ధర అప్పర్‌ సర్క్యూట్‌ను తాకడం విశేషం.

ప్రణయ్ రాయ్, రాధికా రాయ్, ప్రమోటింగ్ సంస్థ ఆర్ఆర్‌పీఆర్ హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌‌లు సీబీఐ స్కానర్‌లో ఉండడంతో.. ఈ కంపెనీ చేతులు మారనుందనే వార్తలు హల్‌ చల్‌ చేశాయి. అయితే  ఈ అంచనాలను ఎన్‌డీటీవీ కొట్టిపారేసింది.  తాము ఎవరితోనూ, ఎలాంటి ఒప్పందాన్ని కుదుర్చుకోలేదని మార్కెట్‌ రెగ్యురేటరీ ఫైలింగ్‌ లో  తెలిపింది.   దీంతో మార్కెట్‌వర్గాల్లో గందరగోళం నెలకొంది.

కాగా 1988లో ప్రణయ్‌రాయ్‌, ఆయన భార్య రాధికా రాయ్‌ ఎన్‌డీటీవీని స్థాపించారు.

 

మరిన్ని వార్తలు