రే టింగ్ అప్‌గ్రేడ్ చేస్తాం..

22 Aug, 2016 00:52 IST|Sakshi
రే టింగ్ అప్‌గ్రేడ్ చేస్తాం..

వృద్ధిని పెంచే సంస్కరణలు కావాలి


న్యూఢిల్లీ: వృద్ధిని పెంచే ఆర్థిక, సంస్థాగత సంస్కరణలను ప్రభుత్వం తీసుకొస్తే భారత రేటింగ్‌ను అప్‌గ్రేడ్ చేసే విషయాన్ని పరిశీలిస్తామని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ తెలిపింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించిన నిబంధనల సరళీకరణ, ఆర్థిక పరిస్థితులకు మరింత స్థిరత్వాన్ని తెచ్చే లా ద్రవ్య విధానాలను రూపొందించడం తది తర సంస్కరణలు అవసరమని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ పేర్కొంది. వృద్ధిని పెంచే, వృద్ధి ని నిలకడగా ఉంచే ఆర్థిక, సంస్థాగత సంస్కరణలను తేవడంలో ప్రభుత్వం విజయం సాధించే అవకాశాలున్నాయని సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్(సావరిన్ రిస్క్ గ్రూప్)మారీ డిరోన్ చెప్పారు. ఫలితంగా రేటింగ్‌కు అప్‌గ్రేడ్ అవకాశాలున్నాయని పేర్కొన్నారు.

 
గత ఏడాది ఏప్రిల్‌లో మూడీస్ సంస్థ భారత రేటింగ్ అవుట్‌లుక్‌ను ‘స్థిరత్వం’ నుంచి ‘సానుకూలం’ నకు మార్చింది.  సంస్కరణల జోరు కారణంగా రేటింగ్‌ను మార్చామని, ఏడాది, ఏడాదిన్నర కాలంలో రేటింగ్‌ను అప్‌గ్రేడ్ చేస్తామని పేర్కొంది. అయితే ఆర్థిక, ద్రవ్య, సంస్థాగత పటిష్ట పరిస్థితులు నెలకొనే అవకాశాలు లేకపోయినా, బ్యాంకింగ్ వ్యవస్థ బలహీనపడినా, లేదా చెల్లింపుల శేషంపై ఆందోళనలు నెలకొన్న భారత్ రేటింగ్ అవుట్‌లుక్‌ను ‘స్థిరత్వం’నకు తగ్గిస్తామని తాజాగా డిరోన్ పేర్కొన్నారు. కాగా భారత్‌కు మూడీస్ సంస్థ ఇచ్చిన సావరిన్ రేటింగ్ ‘బీఏఏ3’గా ఉంది.  ఇది కనిష్ట ఇన్వెస్ట్‌మెంట్ గ్రేడ్. జంక్ రేటింగ్ కంటే ఇది కొంచెం పై స్థాయి.

మరిన్ని వార్తలు