కుప్పకూలిన నెస్లే ఇండియా షేర్లు

3 Jun, 2015 16:30 IST|Sakshi
కుప్పకూలిన నెస్లే ఇండియా షేర్లు

ముంబై:  ముదురుతున్న మ్యాగీ  వివాదం నెస్లే ఇండియా కంపెనీని  ఘోరంగా దెబ్బతీస్తోంది. బుధవారం స్టాక్మార్కెట్లో  నెస్లే  ఇండియా కంపెనీ  లిమిటెడ్ షేర్ భారీగా పతనమైంది. ఈ కంపెనీ షేర్ 10.11 శాతం మేర నష్టపోయింది.  ఎన్ఎస్ఈ, బీఎస్ఈలో దాదాపు రూ. 600 మేరకు నష్టపోయింది. ఒక దశలో 6 వేల రూపాయల దగ్గర   ట్రేడయిన షేర్ చివర్లో తేరుకుని చివరికి  6,191 దగ్గర క్లోజ్ అయింది. గత  24 రోజులుగా రగులుతున్న ఈ వివాదంపై నెస్లే ఇండియా కంపెనీని బీఎస్ఈ వివరణ కోరింది.

సీసం మోతాదు ఎక్కువైందని చిన్నారులకు ప్రాణాంతంకంగా మారే ప్రమాదముందన్న అధికారుల హెచ్చరికలతో మ్యాగీ నూడుల్స్ తయారీ సంస్థ నెస్లే చిక్కుల్లో పడింది. యూపీలో కేరళలో మ్యాగీ ఉత్పత్తులను నిషేధించారు. పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, బీహార్, హర్యానా, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోను మ్యాగీ  శ్యాంపిళ్ల పరీక్షలు మొదలయ్యాయి. మరోవైపు దీనిపై కొత్త చట్టం చేయాలని కేంద్రం యోచిస్తోందని కేంద్ర ఆహారమంత్రి  రాం విలాస్ పాశ్వాన్ ప్రకటించారు. ఈ వివాదం ఇలా ఉండగానే  ఇదే సంస్థకు (నెస్లే)  చెందిన పాల  పొడిలో పురుగులు ఉన్నాయన్న వార్త మరింత  సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మరో రెండు రోజుల్లో  ఈ కంపెనీ  అధికారులకు సమన్లు జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే  సెస్లే షేర్లను  కొనుక్కోవడానికి ఇది మంచి సమయమని ప్రముఖ ఫండ్ మేనేజర్ అశ్విని  గుజ్రాల్ ఇన్వెస్టర్లకు సలహా ఇస్తున్నారు.

మరిన్ని వార్తలు