సాక్షి మనీ మంత్రా: రెండో రోజూ నష్టాల్లోనే ముగిసిన స్టాక్‌మార్కెట్లు

26 Sep, 2023 15:51 IST|Sakshi

ఐసీఐసీఐ ఢమాల్‌

వొడాఫోన్‌ ఐడియా  జూమ్‌

Today Stockmarket Closing bell: దేశీయ స్టాక్‌మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగిసాయి. ఆరంభం నుంచి స్తబ్దుగా కదలాడిన సూచీలు చివరికి వరుసగా రెండో రోజు కూడా బలహీన్‌నోట్‌లో ముగిసాయి.సెన్సెక్స్ 78.22 పాయింట్లు క్షీణించి 65,945  వద్ద, నిఫ్టీ 10 పాయింట్ల నష్టంతో  19,665 వద్ద ముగిసాయి. తద్వారా నిఫ్టీ 19700 దిగువకు చేరింది.

బ్యాంక్, ఫార్మా , ఐటీ మినహా మిగిలిన అన్ని సూచీలు  ప్రధానంగా ఎఫ్‌ఎంసిజి ఇండెక్స్ 0.5 శాతం  లాభంతో  గ్రీన్‌లో ముగిశాయి. బీఎస్‌ఇ మిడ్‌క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్ నోట్‌తో ముగియగా, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.3 శాతం పెరిగింది  వోడాఫోన్‌ ఐడియా ఏకంగా  7శాతం లాభపడి 20 నెలల గరిష్టానికి  చేరింది. ఐషర్‌ మోటార్స్‌, హీరో మోటో, నెస్లే, బజాజ్‌ ఆటో, ఓఎన్జీసీ టాప్‌ గెయినర్స్‌గా టెక్‌ ఎం, సిప్లా, ఇండస్‌ ఇండ్‌, కోటక్‌ మహీంద్ర, అదాని  ఎంటర్‌  ప్రైజెస్‌ టాప్‌ లూజర్స్‌గా  మిగిలాయి.

రూపాయి:డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి మంగళవారం 10 పైసల నష్టంతో 83.23 వద్ద ముగిసింది. సోమవారం 83.14 వద్ద స్థిరపడిన సంగతి తెలిసిందే.


(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)

మరిన్ని వార్తలు