హీరోమోటొకార్ప్ కొత్త చైర్మన్ పవన్ ముంజాల్

2 Jun, 2015 02:32 IST|Sakshi
హీరోమోటొకార్ప్ కొత్త చైర్మన్ పవన్ ముంజాల్

చైర్మన్ ఎమెరిటస్‌గా బ్రిజ్‌మోహన్‌లాల్
న్యూఢిల్లీ: హీరోమోటొకార్ప్ కొత్త చైర్మన్‌గా పవన్ కుమార్ ముంజాల్ నియమితులయ్యారు. ఈ కంపెనీ 1984లో ఏర్పాటైనప్పటి (హోండాతో జాయింట్ వెంచర్) నుంచి చైర్మన్‌గా వ్యవహరిస్తున్న 92 ఏళ్ల బ్రిజ్‌మోహన్ లాల్ స్థానంలో చైర్మన్‌గా ముంజాల్ నియామకాన్ని  కంపెనీ డెరైక్టర్ల బోర్డ్ సోమవారం ఏకగ్రీవంగా ఆమోదించింది.

ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా తనని పదవీ బాధ్యతల నుంచి తప్పించాలన్న బ్రిజ్‌మోహన్‌లాల్ విన్నపాన్ని డెరైక్టర్ల బోర్డ్ ఆమోదించింది. అయితే చైర్మన్ ఎమెరిటస్‌గా తమకు మార్గదర్శిగా, మెంటార్‌గా వ్యవహరించాలని ఆయనను బోర్డు కోరింది. ఇక పవన్ ముంజాల్ కంపెనీకి సీఎండీగా, సీఈఓగా వ్యవహరిస్తారు. బ్రిజ్‌మోహన్‌లాల్ కంపెనీకి చైర్మన్ ఎమెరిటస్‌గా,  డెరైక్టర్ల బోర్డ్‌లో నాన్-ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా వ్యవహరిస్తారు. గతేడాది హీరోమోటో 66.3 లక్షల వాహనాలను విక్రయించింది. కంపెనీ చరిత్రలో ఇవే అత్యధిక అమ్మకాలు.

మరిన్ని వార్తలు