నూతన ఈ–కామర్స్‌ నిబంధనల ప్రభావం స్వల్పమే..

8 Jan, 2019 01:33 IST|Sakshi

నియామక సంస్థల అభిప్రాయం

న్యూఢిల్లీ: ఈ–కామర్స్‌ రంగానికి సంబంధించిన నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల విదేశీ పెట్టుబడుల పరంగా ఆందోళన ఉన్నప్పటికీ.. ఉద్యోగ నియామకాల్లో మాత్రం ప్రతికూల ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని పలు నియామక సంస్థలు అభిప్రాయపడుతున్నాయి.

ఉద్యోగాలపై ఈ ప్రభావం 5–10 శాతం మేర ఉండవచ్చని గ్లోబల్‌ హంట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సునీల్‌ గోయల్‌ అంచనావేశారు. గిడ్డంగులు, రవాణా వంటి సప్లై చైన్‌ సంబంధిత రంగాల్లో వచ్చే 12 నెలల్లో 50,000 ఉద్యోగ అవకాశాలు తగ్గవచ్చు అని రాండ్‌స్టాడ్‌ సీఈఓ, ఎండీ పాల్‌ అభిప్రాయపడ్డారు. 

మరిన్ని వార్తలు