స్మార్ట్‌ఫోన్‌ యూజర్లకు కొత్త న్యూస్‌

8 Feb, 2018 19:50 IST|Sakshi

సాక్షి, టెక్నాలజీ : పలుకే బంగారామాయేనా... అన్నట్లు వాట్సప్‌, మెసేంజర్‌లలో ఎందులోనైనా సరే చాటింగ్‌ చేస్తున్నప్పుడు మన ఫీలింగ్స్‌ను రాసి పంపే కంటే బొమ్మల(ఎమోజీ)తో తెలుపుతాం. కోపంగా ఉన్నామనీ, సిగ్గుపడుతున్నామనీ, ఏడుస్తూ ఉన్నామనీ ఇలా ప్రతీ ఫీలింగ్‌ను నేస్తాలకు తెలియజేస్తాం. రాతల్లో చెప్పలేని మాటలను బొమ్మలతో చెప్పుకుంటాం.

ఇలా ఎమోజీలకు అలవాటు పడిన చాటింగ్‌ ప్రియులకు కొత్తగా మరికొన్ని ఎమోజీలు అందుబాటులోకి రానున్నాయి. ఈ ఏడాది చివరికల్లా కొత్తగా తయారుచేసిన 157 ఎమోజీలన్నీ స్మార్ట్‌ఫోన్‌లోకి అందుబాటులోకి రానున్నాయని యూనికోడ్‌ కన్సార్టియం తెలిపింది. మహిళా సూపర్‌ హీరో, లైట్‌ స్కిన్‌ రెడ్‌ హెయిర్‌ ఉన్న అమ్మాయి, డార్క్‌ స్కిన్‌ కర్లీ హెయిర్‌ ఉన్న అబ్బాయి, దోమ, పైరెట్‌ ఫ్లాగ్‌(డేంజర్‌ జోన్‌లో ఉండే బొమ్మ) ఇలా అనేక రకాల కొత్త ఎమోజీలు ఉన్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు