ఆ కంటెంట్‌ తొలగించకుంటే చర్యలే

7 Oct, 2023 06:06 IST|Sakshi

న్యూఢిల్లీ: సోషల్‌ మీడియాలో బాలలపై లైంగిక వేధింపుల కంటెంట్‌ వ్యాప్తిపై కేంద్రం కన్నెర్రజేసింది. దాన్ని తక్షణం తొలగించాల్సిందేనని స్పష్టం చేసింది. సోషల్‌ మీడియా వేదికలు ఎక్స్, యూట్యూబ్, టెలిగ్రాంలకు ఈ మేరకు శుక్రవారం నోటీసులిచి్చంది. ‘భారత ఇంటర్నెట్‌ పరిధిలో వాటిని తక్షణం శాశ్వతంగా తొలగించండి.

లేదా డిజెబుల్‌ చేయండి‘ అని ఆదేశించింది. లేదంటే ఐటీ చట్టంలో 79వ సెక్షన్‌ కింద వారికి కలిగించిన రక్షణను తొలగిస్తామని ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ హెచ్చరించారు. నిబంధనల మేరకు పౌరులకు నమ్మకమూ, సురక్షితమైన ఇంటర్నెట్‌ను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

మరిన్ని వార్తలు