లాక్‌డౌన్‌ సడలింపుతో మార్కెట్‌ హైజంప్‌..!

1 Jun, 2020 15:46 IST|Sakshi

9800పైన ముగిసిన నిఫ్టీ 

రాణించిన బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌రంగ షేర్లు 

కలిసొచ్చిన అంతర్జాతీయ మార్కెట్ల సానుకూలతలు

లాక్‌డౌన్‌ సడలింపుతో దేశీయ మార్కెట్‌ సోమవారం భారీ లాభంతో ముగిసింది. సెన్సెక్స్‌ 879 పాయింట్ల లాభంతో 33303.52 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 245.85  పాయింట్లు పెరిగి 9826.15 వద్ద స్థిరపడింది. అన్ని రంగాలకు చెందిన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. అత్యధికంగా బ్యాంకింగ్‌ రంగ షేర్లు లాభపడ్డాయి. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలోని కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ దాదాపు 3.50శాతం లాభపడి 19,959.90 వద్ద ముగిసింది. 

కేంద్రం లాక్‌డౌన్‌ సడలింపుతో ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిన పడవచ్చనే ఆశావహన అంచనాలతో పాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో మార్కెట్‌ ప్రారంభం నుంచి మార్కెట్లో విసృతమైన కొనుగోళ్లు జరిగాయి. ముఖ్యంగా ఇండెక్స్‌ల్లో అధిక వెయిటేజీ కలిగిన ఫైనాన్స్‌,  బ్యాంకింగ్‌ రంగ షేర్ల ర్యాలీ సూచీలను భారీ లాభాలను ఆర్జింపజేశాయి. ఒకదశలో సెన్సెక్స్‌ 1249 పాయింట్లు వరకు లాభపడి 33,267 వద్ద, నిఫ్టీ 351 పాయింట్లు పెరిగి 9,931.60 వద్ద ఇంట్రాడే గరిష్టాలను అందుకున్నాయి. 

నిఫ్టీ-50 ఇండెక్స్‌లో ఎంఅండ్‌ఎం, టాటాస్టీల్‌, టైటాన్‌, బజాజ్‌ఫిన్‌సర్వీసెస్‌, బజాజ్‌ఫైనాన్స్‌ సర్వీస్‌ షేర్లు 5.50శాతం నుంచి 10.50శాతం లాభపడ్డాయి. సన్‌ఫార్మా, నెస్లే లిమిటెడ్‌, ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌​, ఇన్ర్పాటెల్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ షేర్లు 2శాతం నుంచి 3శాతం నష్టపోయాయి. 

మరిన్ని వార్తలు