సెట్ టాప్ బాక్స్ అక్కరలేదు..

21 Oct, 2014 01:09 IST|Sakshi
సెట్ టాప్ బాక్స్ అక్కరలేదు..

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డెరైక్ట్ టు హోం (డీటీహెచ్) రంగంలో ఎయిర్‌టెల్ మరో ముందడుగు వేసింది. అంతర్గతంగా స్మార్ట్ కార్డ్ కలిగిన ఇంటెగ్రేటెడ్ డిజిటల్ టీవీలను (ఐడీటీవీ) శామ్‌సంగ్‌తో కలిసి భారత్‌లో తొలిసారిగా ఆవిష్కరించింది. ఈ స్మార్ట్ టీవీల కు సెట్ టాప్ బాక్స్ అవసరం లేకుం డానే డిజిటల్ ప్రసారాలను వీక్షించొచ్చు. ఐడీటీవీల ప్రత్యేకత ఏమంటే సిగ్నల్ నష్టాలను తగ్గిస్తాయి. ఒకే రిమోట్‌తో టీవీ ఆపరేట్ చేయొచ్చు. యాంటెన్నా నుంచి టీవీ వరకు తక్కువ వైర్లుంటాయి. విద్యుత్ 10% ఆదా అవుతుంది.

ఇక పిక్చర్, శబ్దం నాణ్యతా బాగుంటుంది. శామ్‌సంగ్ స్మార్ట్ యాప్స్‌తోపాటు ఇన్ బిల్ట్ వైఫై కూడా ఉంది.శామ్‌సంగ్ హెచ్‌డీ ఎల్‌ఈడీ స్మార్ట్ డెరైక్ట్ టీవీల ధర రూ.44,900 నుండి ప్రారంభం. శామ్‌సంగ్ ప్లాజా, ప్రముఖ ఎలక్ట్రానిక్స్ ఔట్‌లెట్లలోనూ ఇవి లభిస్తాయి. పరిచయ ఆఫర్‌లో రూ.2,851 విలువగల ఎయిర్‌టెల్ మెగా హెచ్‌డీ డీటీహెచ్ ప్యాక్ 4 నెలలు ఉచితం.
 
వీక్షణలో కొత్త అధ్యాయం..: టీవీ వీక్షణలో ఐడీటీవీలు నూతన ఒరవడి సృష్టిస్తాయని భారతి ఎయిర్‌టెల్ డీటీహెచ్, మీడియా సీఈవో శశి అరోరా సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. టెక్నాలజీ, సౌకర్యం  వీటి ప్రత్యేకతన్నారు. వీటి అభివృద్ధికి భారీగా వ్యయం చేశామన్నారు.యూఎస్, ఈయూ వంటి దేశాల్లో ఈ టెక్నాలజీ ప్రాచుర్యంలో ఉందన్నారు. ఐడీటీవీ కస్టమర్ల కోసం ప్రత్యేక బ్రాడ్‌బ్యాండ్ ప్యాక్‌లను ఆఫర్ చేస్తున్నామని తెలిపారు.  కాగా, హెచ్‌డీఎంఐ కేబుల్‌తో ఇతర కంపెనీల సెట్ టాప్ బాక్స్‌ను సైతం ఈ టీవీలకు అనుసంధానించుకోవచ్చు.

మరిన్ని వార్తలు