అందుబాటులోకి ‘నోకియా 3.2’ స్మార్ట్‌ఫోన్‌

22 May, 2019 13:13 IST|Sakshi

న్యూఢిల్లీ: రెండు రోజుల బ్యాటరీ లైఫ్, హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లేతో 6.62 అంగుళాల తెర కలిగిన నోకియా 3.2 స్మార్ట్‌ఫోన్‌ను మంగళవారం హెచ్‌ఎమ్‌డీ గ్లోబల్‌ విడుదల చేసింది. రెండు వేరియంట్లలో ఈ ఫోన్‌ అందుబాటులోకి రానుంది. 2జీబీ ర్యామ్‌+ 16జీబీ ఇంటర్నల్‌ స్టోరేజి కలిగిన వేరియంట్‌ ధర రూ.8,990గా, 3జీబీ ర్యామ్‌+ 32జీబీ ఇంటర్నెల్‌ స్టోరేజీ కలిగిన వేరియంట్‌ ధర రూ.10,790 గా నిర్ణయించారు.

మరిన్ని వార్తలు