మిస్త్రీ వివాదం: నస్లీ వాడియా సంచలన నిర్ణయం

13 Jan, 2020 13:54 IST|Sakshi

రతన్‌ టాటా, ఇతరులకు మరో భారీ ఊరట

రతన్‌ టాటా, నస్లీ భాయీ భాయీ:  కేసుల ఉపసంహరణ

రూ. 3 వేల కోట్ల  పరువునష్టం దావా ఉపసంహరణ

సాక్షి, న్యూఢిల్లీ:  టాటా-మిస్త్రీ వివాదంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వివాదంలో టాటాపై నమోదుచేసిన ​క్రిమినల్‌ డిఫమేషన్‌ కేసును ఉపసంహరించుకోవాలని బాంబై  డైయింగ్‌  చైర్మన్‌ నస్లీ వాడియా నిర్ణయించారు. రతన్‌ టాటా సహా ఇతరులపై రూ. 3వేల కోట్ల విలువైన పరువు నష్టం దావాలున్నింటిని వెనక్కి తీసుకున్నారు. దీంతో వాడియా - టాటా యుద్ధానికి తెరపడింది. పరిణతి చెందిన వ్యక్తులుగా ఇద్దరూ  కేసులను పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి శరద్ అరవింద్ బొబ్డే టాటా, వాడియాలను ఇటీవల కోరారు. ఈ నేపథ్యంలోనే ఈ  పరిణామం చోటుచేసుకోవడం విశేషం.

రతన్ టాటాపై పరువు నష్టం దావాను వాడియా గ్రూప్ చైర్మన్ నుస్లీ వాడియా ఉపసంహరించుకున్నారు. వాడియాపై పరువు తీసే ఉద్దేశం లేదని టాటా సుప్రీంకోర్టుకు చెప్పడంతో భారత సంతతికి చెందిన బ్రిటిష్ పార్సీ వ్యాపారవేత్త ఈ నిర్ణయం తీసుకున్నారు. టాటా సన్స్‌ నుంచి ఆయన మిత్రుడు మిస్త్రీకి ఉద్వాసన పలికిన అనంతరం వాడియా ఆయనకు మద్దతుగా నిలిచారు. దీంతో టాటా మోటార్స్‌, టాటా స్టీల్‌,  టాటా కెమికల్స్‌లో అత్యంత సీనియర్‌ ఇండిపెండెంట్‌ డైరెక్టరుగా ఉన్న నస్లీ వాడియాను తొలగించేందుకు నిర్ణయించింది. దీంతో రూ .3,000 కోట్లు పరిహారం కోరుతో 2016 డిసెంబర్‌లో పరువు నష్టం  కేసు దాఖలు చేశారు. ఇందులో వాడియా బోర్డు సభ్యులు అజయ్ పిరమల్, రణేంద్ర సేన్, విజయ్ సింగ్, వేణు శ్రీనివాసన్, రాల్ఫ్ స్పేత్ , ఎఫ్ఎన్ సుబేదార్లతో పాటు మిస్త్రీ తరువాత వచ్చిన టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్‌ను కూడా చేర్చారు. 2019  జూలైలో  బాంబే  హైకోర్టు ఈ కేసును కొట్టివేయడంతో ఈ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. 

కాగా, టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌ తన తొలగింపుపై సూరస్‌ మిస్త్రీ దాఖలు చేసుకున్న కేసులో మిస్త్రీని తిరిగి నియమించాలని కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఎన్‌సిఎల్‌టి) ఉత్తర్వులిచ్చింది. అయితే జనవరి 10న ఈ  ఉత్తర్వులను సుప్రీంకోర్టు నిలిపి వేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు