క్రెడిట్‌ కార్డుతో ఆ ఫోన్‌ కొన్నారా? అయితే జాగ్రత్త!

16 Jan, 2018 12:26 IST|Sakshi

సాక్షి, ముంబై: వన్‌ ప్లస్‌  యూజర్లకు   క్రెడిట్‌ కార్డ్ షాక్‌ తగిలింది.  క్రెడిట్‌ కార్డ్‌ ద్వారా వన్‌ ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేసిన వినియోగదారులు హ్యాకింగ్‌ బారిన పడ్డారు.  గత నాలుగు నెలల కాలంలో ఇలాంటి పలు అక్రమ లావాదేవీలు నమోదు అయ్యాయి.  దీంతో   వన్‌ప్లస్‌ కస్టమర్లు లబోదిబోమంటున్నారు.

తమ క్రెడిట్‌ ద్వారా అక్రమ లావాదేవీలు చోటు చేసుకున్నాయంటూ వన్‌ప్లస్‌ వెబ్‌సైట్‌ ద్వారా మొబైల్‌   కొనుగోలు చేసిన క్రెడిట్‌ కార్డు వినియోగదారులు  ఆందోళన వ్యక్తం చేశారు. 70మందికిపైగా  కస‍్టమర్లు దీనిపై సంస్థకు ఫిర్యాదు చేశారు.  మరోవైపు ఒకరు తరువాత ఒకరు ఈ  మోసం పై ఫిర్యాదు చేయడంతో  స్పందించిన సంస్థ  తక్షణమే విచారణ చేపట్టినట్టు బ్లాగ్ పోస్ట్ లో  తెలిపింది. ప్రత్యక్షంగా తమ వెబ్‌సైట్‌ద్వారా  (పేపాల్ లాంటి మూడవ పార్టీతో సంబంధం లేకుండా)   జరిగిన అక్రమ  లావాదేవీల అంశాన్ని  సీరియస్‌గా పరిగణించినట్టు పేర్కొంది. తమ సైట్‌ను కస్టమ్‌ కోడ్‌తో  పునర్నిర్మాణం  చేస్తున్నామని  వెల్లడించింది.

మరిన్ని వార్తలు